మంచి భర్త దొరకాలంటే ఇక్కడి అమ్మాయిలు చేయాల్సింది ఇదే!

south africa girl for good husband

మనిషి జీవితంలో ప్రధానంగా వివాహమనేది ఓ భాగం. ఇక అందమైన, మంచి మనసున్న అబ్బాయి భర్తగా రావాలని ప్రతీ అమ్మాయి అమ్మాయి కోరుకుంటుంది. పెళ్లి చేసుకుని పిల్లలతో పాటు హాయిగా ఉండాలనేదే అమ్మాయిల డ్రీమ్. అయితే అలాంటి భర్తను పొందెందుకు యువతులు ముఖ్యంగా వారి అందం విషయంలో జుట్టుపై ఎక్కువ ఫోకస్ పెడతారన్నది అందిరికీ తెలిసిందే.

bald girlకానీ దక్షిణాఫ్రికాలోని అమ్మాయిలు మాత్రం మంచి భర్త రావాలంటే కేశలంకరణలో కాస్త విరుద్దమైన, వింతైన ఆచారం ఉందట. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాఫ్రికాలోని ఓ తెగకు చెందిన అమ్మాయిలకు మంచి భర్త దొరకాలంటే ఖచ్చితంగా గుండు చేయించుకోవాల్సిందేనట. అవును వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇదే నిజం. ఇక ఇథోపియా, సోమాలియా ప్రాంతాల్లో స్థిరపడిన బొరానా తెగ ప్రజల్లో ఈ వింత ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక వీరి తెగల్లోని యువతులు పెళ్లి కంటే ముందుగా జుట్టును పెంచుకునేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. కానీ పెళ్లి చేసే ప్రయత్నాల్లో భాగంగా ఎంత తక్కువ జుట్టు కనిపిస్తే అంత మంచి భర్త దొరకుతాడని వీరి నమ్మకం. ఇక గుండు చేయించుకుంటే మాత్రం మంచి అత్తింటివారితో పాటు భర్త కూడా మంచోడు దొరుకుతాడని వీరు అంటున్నారు. ఇక వింత ఆచారాన్ని కొనసాగిస్తున్న వీరి నమ్మకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.