డీజిల్‌, కిరోసిన్‌ను మంచి నీళ్లలా తాగుతున్న ప్రజలు

Water Problem in Greenland - Suman TV

రోజు తాగుతున్న నీటిని ఒక రోజు ప్రభుత్వ అధికారులు వచ్చి పరీక్షించారు. ఇక్కడి తాగునీటిలో పెట్రోలియం ఇంధనాలు అధికశాతంలో ఉన్నాయని నిర్ధారించారు. అంటే ఇన్ని రోజులు మేము మంచి నీళ్లు కావా? డీజిల్‌, కిరోసినా అని అక్కడి ప్రజలు షాక్‌ తిన్నారు. ఆశ్చర్యపరిచే ఈ ఘటన గ్రీన్‌ల్యాండ్‌కి సరిహద్దుగా ఉన్న కెనడాకి ఉ‍త్తర ప్రాంతమైన నునావుట్‌ రాజధాని ఇకాలూయిట్‌లో చోటుచేసుకుంది. అక్కడి భూగర్భ జలాల్లోని తాగు నీటిలో అధిక శాతం ఇంధన ఆయిల్‌లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ల్యాబ్‌ అధికారులు ఆ నగరంలోని వాటర్‌ ట్యాంక్‌ నుంచి సేకరించిన తాగు నీటిలో ఇంధన ఆయిల్‌లు అధిక స్థాయలో ఉన్నట్లు నిర్థారించారు.

Water Problem in Greenland - Suman TVఈ సందర్భంగా ఇకాలుయిట్‌ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ అమీ ఎల్గర్స్మా మాట్లాడుతూ….”భూగర్భ జల కాలుష్యం కారణంగా ట్యాంక్‌లోని నీటిలో అధికంగా ఇంధన వాసన వస్తుండవచ్చు. బహుశా ఆ వాసన డీజిల్‌ లేదా కిరోసిన్‌కి సంబంధించిన వాసన కావచ్చు. సురక్షితమైన నీరు అందుబాటులోకి వచ్చేంత వరకు ఈ నీటిని ప్రజలు ఉపయోగించవద్దు. నీటిని కాచినప్పటికీ ఆ వాసన పోదని పైగా మీరు మీ ట్యాంకులోని నీటిని ఎప్పటి నుంచి వినయోగించుకోవచ్చో కూడా మేమే తెలియజేస్తాం” అని అన్నారు. ఈ మేరకు ఈ నీటిని వినియోగిస్తే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పై అత్యంత ప్రభావం చూపే అవకాశం ఎక్కువ అంటూ నునావుట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మైఖేల్ ప్యాటర్సన్ ప్రజలను హెచ్చరించారు. తాగు నీటి సమస్య ఒక తీరని సమస్యగా ఉందంటూ..కెనడా లిబర్‌ ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. 2015లో అన్ని మరుగు నీటి సమస్యలను పరిష్కిరిస్తానన్న హామీతోనే జస్టిన్‌ ప్రధానిగా ఎన్నికవ్వడం గమనార్హం.