వ్యాక్సిన్ తీసుకో… బహుమతులందుకో !..

టీకాలు వేయించుకునేందుకు జనాలను ప్రోత్సహించేందుకు అమెరికాలో కొన్ని రాష్ట్రాలో అనేక ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. ప్రోత్సాహకాలు ఎందుకంటే టీకాలు వేయించుకునేందుకు జనాలు ముందుకు రావటంలేదు కాబట్టే. వినటానికి కాస్త విచిత్రంగా ఉన్నా వాస్తవం అయితే ఇదే. అమెరికా జనాభా 33 కోట్లు. అందరికీ టీకాల కార్యక్రమాన్ని పూర్తిచేసుకునేందకు ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసింది. జనాలు కూడా బాగానే స్పందించారు. మొదటి డోసు వేయించుకున్న వారు 16 కోట్లమందున్నారు. అలాగే రెండు డోసులు వేయించుకున్న వారిసంఖ్య 12 కోట్లు. మొదట్లో టీకాల కార్యక్రమం చాలా జోరుగా జరిగినా తర్వాత ఒక్కసారిగా ఆగిపోయిందట. ప్రభుత్వం, స్వచ్చంద సంస్ధలు ఎంత మొత్తుకుంటున్నా టీకాలు వేయించుకునేందుకు జనాలు అసలు ముందుకే రావటంలేదట. దీనికి కారణం టీకాలు వేయించుకుంటే సెక్సుకు పనికిరారని, పిల్లలు పుట్టరనే ప్రచారం జరగటమే. మరి ఈ ప్రచారం ఎలా మొదలైందో ? ఎవరు మొదలుపెట్టారో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఒక్కసారిగా టీకాలు వేయించుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ప్రజలందరికీ టీకాలకు ప్రభుత్వం, స్వచ్చంద సంస్ధలు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలవుతున్నాయి. దాంతో చేసేది లేక చివరి ప్రయత్నంగా తాయిలాలు మొదలుపెట్టాయి. మన దగ్గర ఎన్నికల్లో ఇచ్చే తాయిలాల్లాంటివే ఇపుడు టీకాల కోసం అమెరికాలో ఇస్తున్నారు. టీకాలు వేయించుకుంటే బీర్లు ఉచితమని న్యూజెర్సీలో ప్రచారం మొదలుపెట్టింది.

115324754 gettyimages 1283824133

అలాగే కనెక్టికట్, ఫిలడెల్ఫియా, షికాగో, వెస్ట్ వర్జీనియా, న్యూయార్క్ లాంటి రాష్ట్రాల్లో టీకాలు వేసుకుంటే 50 లక్షల లాటరీ బహుమతి టికెట్లని, ఉద్యోగులకు 200 డాలర్ల ప్రోత్సాహకమని, నిత్యావసర సరుకులని, మెట్రోలో ప్రయాణం వారంపాటు ఉచితమని, డిపార్టుమెంట్ స్టోర్లలో ఎంపిక చేసుకున్న సరుకులు ఉచితమని ఇలాంటి అనేక తాయిలాలు ప్రకటిస్తున్నారు.  దుబాయ్‌లో 15 రోజుల జిమ్‌ సభ్యత్వాన్ని ఉచితంగా ఇస్తున్నారు. మన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో టీకా వేయించుకున్న మహిళలకు బంగారు ముక్కుపుడకలు ఇస్తామని బంగారు వ్యాపారులు ప్రకటించారు. పురుషులకేమో హ్యాండ్‌ బ్లెండర్లు ఇస్తున్నారట. ఏపీలోని విజయనగరం జిల్లాలో ఒక కంపెనీ టీకా తీసుకున్న వారికి ఉచిత బిర్యానీ ఆఫర్‌ ఇచ్చింది.