కొవిడ్​ వ్యాక్సిన్లలో మైక్రోచిప్స్‌ ఉన్నాయా?!.

కొవిడ్​ వ్యాక్సిన్‌ వస్తే గాని మనుషుల జీవితం సాధారణ స్థితికి రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అందరూ టీకా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థలు, మందుల తయారీ సంస్థలు అయితే పూర్తిగా ఆ పనిలోనే ఉన్నాయి.   సులభంగా చెప్పాలంటే ఒక వ్యాధి రాకుండా నిరోధించడానికి అదే వ్యాధికారకాన్ని చిన్న మొత్తంలో ఆరోగ్యవంతుల శరీరంలోకి ఎక్కిస్తారు. దాంతో వ్యాధికి సంబంధించిన లక్షణాలు కొద్ది కొద్దిగా కన్పిస్తాయి. అది చూసి వ్యాక్సిన్ల గురించి అపోహలు, కుట్ర సిద్ధాంతాలు, అపోహలు ఆన్‌లైన్‌లో తిరుగుతూనే ఉన్నాయి.

Vaccination 01 minఅమెరికాలో ఉన్నవి పక్షులు కాదు రోబోలు అనే సిద్ధాంతాన్ని నమ్మే కొందరు అమెరికాలో ధర్నా నిర్వహించారనే వార్తలు చూశాం. కానీ, ఆ సిద్ధాంతానికి ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు కొట్టిపారేస్తున్నారు.కరోనా వ్యాక్సిన్ల విషయంలో   మరో సిద్ధాంతం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ప్రజలకు వేస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్లలో మైక్రోచిప్స్‌ ఉన్నాయని కొందరు అమెరికన్లు ఆరోపిస్తున్నారు. వ్యాక్సిన్ల ద్వారా మైక్రోచిప్‌ను మనిషిలోకి ఎక్కించి దాంతో వారిని ట్రాక్‌ చేస్తున్నారని  ఓ నిరాధార సిద్ధాంతాన్ని లేవనెత్తారు. అమెరికన్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతుండటం గమనార్హం.

ఓ అంతర్జాతీయ పత్రికతో కలిసి మైగావ్‌ అనే సంస్థ సర్వే నిర్వహించింది. మొత్తంగా 20శాతం మంది అమెరికన్లు వ్యాక్సిన్‌లో మైక్రోచిప్‌ ఉంటుందని భావిస్తున్నారట. వారిలో 30-44 మధ్య వయస్కులు ఎక్కువగా ఉన్నట్లు సంస్థ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 46 శాతం మంది ఇది తప్పుడు సమాచారమని కొట్టిపారేస్తుండగా 7శాతం మంది నిజంగానే వ్యాక్సిన్‌లో మైక్రోచిప్‌ ఉంటుందని నమ్ముతున్నారు.

మరో 20శాతం మంది బహుశా నిజమే అయి ఉంటుందని చెప్పారట.   ఈ సిద్ధాంతం తప్పని, వ్యాక్సిన్లలో మైక్రోచిప్‌ పెడుతున్నట్లు నిరూపించేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సోషల్‌మీడియా ద్వారా ఈ కుట్ర సిద్ధాంతం ప్రజల దృష్టికి వెళ్లడంతో కొంతమంది ఆసక్తికరంగా ఉందని గుడ్డిగా నమ్మేస్తున్నారని చెబుతున్నారు.