మన జీవితంలో ఏం నిమిషం ఏం జరుగుతుందో ఊహించలేం. అప్పటి వరకు ఆర్థికంగా బాగా ఉన్నవారు కూడా.. అకస్మాత్తుగా దివాళ తీయవచ్చు. ఇలాంటి పరిస్థితిని మన తెలుగులో బండ్లు ఓడలు కావడం.. ఓడలు బళ్లు కావడం అంటారు. ఈ సామెతకు సరిగా సరిపోతుంది ఇప్పుడు మీరు చదవబోయే కథనం. ఆరు నెలల క్రితం వరకు ఆయన దేశానికి ఆర్థిక మంత్రి. వేల కోట్ల రూపాయల విలువైన బడ్జెట్ తన చేతుల మీదుగా ప్రవేశపెట్టారు. దేశానికి ఆర్థిక మంత్రి హోదాలో.. హంగూ ఆర్భాటాలతో జీవించిన వ్యక్తి. మరి ఇప్పుడు ఆ పరిస్థితి తలకిందులైంది. ఒకప్పుడు లగ్జరీ కార్లలో తిరిగిన వ్యక్తి నేడు క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. కుటుంబ పోషణ కోసం కారు నడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన కథనం ఎందరినో కదిలిస్తోంది.
ఇది కూడా చదవండి: తాలిబన్ల తిక్క కుదిరిందా? ఏం చేయాలో అర్థంకాక అయోమయం
అమెరికాకు తన అసరం తీరిపోయిన తర్వాత అఫ్గానిస్తాన్ వాసులను నడి వీధిలో వదిలేసి వెళ్లింది. మీ చావు మీరు చావండి అంటూ అర్థరాత్రి ఉన్నపళంగా తన సైన్యాన్ని ఉపసంహరించుకుంది. అప్పటి వరకు అడ్రెస్ లేకుండా పోయినా తాలిబన్లు.. అమెరికా సైన్యం వెనుదిరగడంతో మళ్లీ తమ పంజా విసిరారు. దేశంలో అల్లకల్లోలం సృష్టించారు. తాలిబన్ల దాడి నుంచి ప్రజలను కాపాడాల్సిన అధ్యక్షుడు.. వారిని గాలికొదిలి… దేశం విడిచి పారిపోయారు. తాలిబన్లు కాబూల్‌ని ఆక్రమించడానికి ముందు అధ్యక్షుడు ఆష్రఫ్ ఘని ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు ఖలీద్ పాయెండ. అయితే అధ్యక్షుడితో విబేధాల కారణంగా తాలిబన్లు కాబూల్ నగరాన్ని ఆక్రమించుకోవడానికి 10 రోజుల ముందే అనగా ఆగస్టు 10, 2021న ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఇది కూడా చదవండి: తాలిబాన్ ప్రభుత్వానికి భారత్ గోధుమల ఎగుమతి.. అంగీకరించిన పాకిస్తాన్
దీని గురించి ఖలీద్ తన ట్విట్టర్‌లో.. ‘‘ఈరోజు నేను తాత్కాలిక ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశాను. ఆర్థిక శాఖకు నాయకత్వం వహించడం నా జీవితంలో గొప్ప గౌరవం. కానీ వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో పదవీ విరమణ చేయాల్సిన సమయం వచ్చింది’’ అని తెలిపారు. ఆ తర్వాత తాలిబన్లు నిర్బంధిస్తారనే భయంతో ఖలీద్ తన కుటుంబంతో సహా అఫ్గనిస్తాన్ వీడి.. అమెరికాకు చేరుకున్నారు.
ఇది కూడా చదవండి: గ్రౌండ్‌లో సిగరేట్ తాగుతూ కెమెరాకు చిక్కిన స్టార్ క్రికెటర్
అఫ్గన్ నుంచి ప్రాణభయంతో పారిపోయిన ఖలీద్ ప్రస్తుతం అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఉబర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘ఆరు గంటల పనికి 150 డాలర్లకు పైగా సంపాదిస్తున్నాను. నా ప్రయాణాన్ని లెక్కించడం లేదని చెప్పారు. డ్రైవర్‌గా మారడం సర్దుబాటు మాత్రమే. అయితే నేను చేస్తున్న పనికి కుటుంబం నుంచి మద్దతు లభించినందుకు కృతజ్ఞతతో ఉన్నాను’’ అని ఇంటర్వ్యూలో తెలిపారు. తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించకపోవడంతో అఫ్గన్ ఆర్ధిక, మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.