ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. డిసెంబర్ 17న విడుదలైన పుష్ప బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ అభిమానులైతే పుష్ప సక్సెస్ తో పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పుష్ప మూవీకి సంబందించిన ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
పుష్పలో అల్లు అర్జున్ కి తల్లిగా కల్పలత నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే తల్లి సెంటిమెంట్ సీన్లు సినిమాకే హైలైట్ అయ్యాయి. అల్లు అర్జున్ తల్లి పాత్రలో కల్పలత ఒదిగిపోయింది. ఎమోషనల్ సీన్లలో ప్రేక్షకులచేత కన్నీళ్లు పెట్టించింది. కల్పలత సుమారు 50 పైగా సినిమాలు, 10 సీరియల్స్‌లో నటించినా రాని గుర్తింపు ఒక్క పుష్ప సినిమాతో వచ్చింది.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏటంటే, పుష్పరాజ్‌కి తల్లిగా నటించిన కల్పలత వయసు.. అల్లు అర్జున్ కంటే కేవలం రెండేళ్లు మాత్రమే పెద్దట. ఈ విషయాన్ని కల్పలతే స్వయంగా చెప్పింది. తన వయసు గురించి అల్లు అర్జున్ కు, తనకు మద్య జరిగిన సంభాషణ చెప్పారు. పుష్ప మూవీలో కొత్త కారు కొని ఇంటికి తీసుకుని వచ్చే సీన్ షూటింగ్ సందర్బంగా, బన్నీ తనను.. అమ్మా మీ ఏజ్ ఎంత.. అని అడిగారాట.
అల్లు అర్జున్ అలా అడిగే సరికి కల్పలత ఒక్కసారిగా షాక్ అయ్యిందట. దాన్ని గమనించిన బన్నీ, మీ ఏజ్ ఎంత అని అడుగున్నా.. కంగారు పడమాకు అన్నారని చెప్పింది. సార్ నాకు 42 అనేసరికి, హా 42 ఏళ్లేనా.. అని ఆశ్చర్యపోయాడట అల్లు అర్జున్. ఎంతమంది పిల్లలని అడిగటంతో, ఇద్దరు పిల్లలు అని చెప్పేసరికి.. వాళ్లు ఏం చదువుకుంటున్నారని అడిగారట. సార్ వాళ్లిద్దరూ జాబ్ చేస్తున్నారని కల్పలత చెప్పేసరికి, బన్నీ ఎక్స్ ప్రెషన్ ఛేంజ్ అయిపోయిందట. జాబ్ చేయడం ఏంటమ్మా, ఇంతకీ మీకు పెళ్లి ఎప్పుడైంది అని ప్రశ్నించడంతో.. 14 ఏళ్లకే పెళ్లైందని అసలు విషయం చెప్పింది కల్పలత.
ఇప్పుడు షాకవ్వడంతో అల్లు అర్జున్ వంతైంది. నీకు, నాకు కేవలం రెండు సంవత్సరాలే తేడా అని బన్నీ చెప్పడంతో ఔనా అనుకందట కల్పలత. ఈ క్రమంలో ఓ సారి షూటింగ్ గ్యాప్ లో డైరెక్టర్ సుకుమార్ తో, డార్లింగ్.. మా అమ్మకి నాకు రెండు సంవత్సరాలే తేడా తెలుసా.. అని చెప్పారట అల్లు అర్జున్. అన్నట్లు కల్పలత స్వస్థలం తెలంగాణలోని ఖమ్మంజిల్లా మణుగూరు. పదో తరగతిలోనే కల్పలతకి పెళ్లైంది. ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, అమెరికాలో చదువుకుంటున్నారు.