Madhavan: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘మాధవన్’. డబ్బింగ్ సినిమాలతో ఆయన తెలుగు వారికి సుపరిచితమే. మాధవన్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సఖి సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. హిందీ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఆయన మాతృభాష తమిళంతో కలిపి మొత్తం ఆరు భాషల్లో సినిమాలు చేశారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘‘ రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రముఖ ఇస్రో సైంటిస్టు నంబి నారాయన్ బయోపిక్‌గా తెరకెక్కింది. తాజాగా, 75వ కేన్స్ ఉత్సవాల్లో పాల్గొన్న మాధవన్ ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… 4 ఏళ్ల పాటు తాను ఎదుర్కొన్న ఆర్థిక కష్టాల గురించి వెల్లడించారు.
లాక్‌డౌన్ సమయంలో రెండేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని, దాని తర్వాత రాకెట్రీ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. ఆ తర్వాత ‘డీకపుల్డ్’ వెబ్ సిరీస్ కారణంగా ఆర్థికంగా కొంత ఊరట లభించిందని తెలిపారు. తాను హిట్ చూసిన చివరి చిత్రం ‘‘ విక్రమ్ వేద’’ అని పేర్కొన్నారు. అప్పుడు తనకు నిరంతరమైన భయం ఉండిందని అన్నారు. కాగా, విక్రమ్ వేద తర్వాత మాధవన్ నటించిన అన్ని చిత్రాలు ప్లాపులుగా నిలిచాయి. వీటిలో రెండు సినిమాల్లో ఆయన గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. తెలుగులో ఆయన చేసిన ‘సవ్యసాచి’, నిశ్శబ్ధం ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ అపజయాన్ని మూటగట్టాయి. మరి, మాధవన్ ఆర్థిక కష్టాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Kangana Ranaut: కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఆ లగ్జరీ కారు కొన్న ఫస్ట్ ఇండియన్‌గా కంగనా!