రాత్రికి రాత్రి మహేష్ బాబు లాగా ఎలా అవుతాం.. ఈ టీజర్ చూడండి

ఫిల్మ్ డెస్క్- ఇల్లు చూస్తే ఇల్లాలు గురించి చెప్పవచ్చని మన పెద్దలు చెప్పారు. అలాగే టీజర్ చూసి సినిమా ఎలా ఉంటుందో చెప్పవచ్చని ఇప్పుడు ఎవరిని అడిగినా చెబుతారు. అవును మరి ఒకప్పుడంటే సినిమా డైరెక్ట్ గా ధియేటర్ లో రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు ప్రీరిలీజ్ వేడక, ఆడియో ఫంక్షన్, పోస్టర్, టీజర్.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి. చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఏంలేదు.. ఏ సినిమా అయినా ముందు టీజర్ వచ్చేస్తుంది.

ఇక టీజర్ ను బట్టి ప్రేక్షకులు సినిమాపై అంచనా వేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది టీజర్ ను బట్టే ఆ సినిమా చూడాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటున్నారు. అందుకే రెండున్నర గంటల సినిమాను రెండు నిమిషాల టీజర్ లో చూపించేందుకు డైరెక్టర్లు చాలా కష్టపడుతున్నారు. ఇదంతా ఎందుకంటే.. తాజాగా మరో సినిమా టీజర్ వచ్చేసింది.

DJ 1

అవును డిజె టిల్లు మూవీ టీజర్ విడుదలైంది. సిద్థు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా నటిస్తున్న డిజె టిల్లు సినిమాకు విమల్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్‌ మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను ఆదివారం విడుదల చేశారు మేకర్స్. టీజర్‌లో సిద్ధు జొన్నలగడ్డ రాత్రికి రాత్రి మహేశ్‌ లెక్క ఎట్లైతది అంటూ సాగే మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ప్రస్తుతం డిజె టిల్లు టీజర్‌ యూట్యూబ్ లో బాగా వైరల్‌ అవుతోంది. ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకునేలా సాగే కధతో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇది ప్రేమ కధే అయినా కొత్త తరం రొమాంటిక్‌ ప్రేమకథా చిత్రమని దర్శకుడు విమల్ కృష్ణ చెప్పారు. మరింకెందుకు ఆలస్యం.. మీరు కూడా డిజె టిల్లు టీజర్ పై ఓ లుక్కేయండి.