పాకిస్థాన్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన హిందూ యువతి

ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మహిళలు అన్ని రంగాలలోనూ దూసుకుపోతున్నారు. కొన్ని సంఘటనల కారణంగా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలని ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు అన్ని రంగాలలోనూ వీరి ప్రాతినిధ్యం ఉంది. అయితే ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన భారతేదేశానికి చెందిన హిందూ మహిళ పాకిస్థాన్ లో ఒక ఉన్నత స్థానానికి చేరుకుంది. పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. భారతదేశంలో ఐఏఎస్ ఎలానో పాక్ లో పీఏఎస్ కూడా అలాంటిదే. పీఏఎస్ అంటే పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇక్కడ యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్) తరహాలో పాక్ లో సీసీఎస్ (సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్) పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటి వరకు అక్కడ జీవిస్తున్న హిందువులలో ఎవ్వరూ కూడా పెద్ద పదవులలో ఉన్న పరిస్థితి లేదు.

Sana Ramchand

పూర్తి వివరాల్లోకి వెళితే, ఈమె పేరు సనా రాంచంద్. సనా సింధ్ ప్రావిన్స్ లోని షికార్పూర్ జిల్లాలో నివసిస్తున్నారు. పాక్‌లో హిందువులు ఎక్కువగా ఉండే సింధ్‌ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతానికి సనా చెందిన వారు. సింధ్ ప్రావిన్స్ లోని చంద్కా మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఈమె వృత్తి రీత్యా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయినప్పటికీ, అంతకు మించి ఏదో సాధించాలన్న తపన ఆరాటం ఒక గొప్ప స్థాయికి చేర్చింది. సనా పాకిస్థాన్ లో నిర్వహించిన పాకిస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ పరీక్షలో అర్హత సాధించింది. తొలి హిందూ మహిళా కలెక్టర్‌ గా పదవిని చేపట్టబోతోంది. 18,553 మంది రాత పరీక్షకు హాజరయ్యారు. 221 మంది ఉత్తీర్ణులు కాగా వారిలో 79 మంది మహిళలు ఉన్నారు.