షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం.. పవన్ తో హరిహర వీరమల్లు టీం భేటీ

ఫిల్మ్ డెస్క్- పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరో తాజాగా నటిస్తున్న సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్ మరియు పాట ఎంతలా సంచలనం సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో భీమ్లా నాయక్ పాట కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తరువాత నటించబోయే సినిమా హరిహర వీరమల్లు. భీమ్లా నాయక్ మూవీ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా షూటింగ్ మిగతా భాగం సెట్స్ పైకి వెళ్లనుంది.

‘భీమ్లా నాయక్‌’ షూటింగ్‌ పూర్తైన వెంటనే ‘హరిహర వీరమల్లు’ మూవీ చిత్రీకరణ ప్రారంభించడానికి మెకర్స్ ప్రణాళిక సిద్థం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పవన్‌కల్యాణ్‌ తో దర్శకుడు క్రిష్‌, చిత్ర సమర్పకుడు ఎ.ఎం.రత్నం సమావేశం అయ్యారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ 50 శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన భాగాన్ని నిరవధికంగా షూటింగ్‌ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత దయాకర్‌ రావు తెలిపారు.

Harihara Veeramallu 1

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌లో 2022 ఏప్రిల్‌ 29న సినిమాను విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథ కావడంతో, అత్యద్భుతమైన విజువల్‌ ఫీస్ట్‌ గా ‘హరిహర వీరమల్లు’ సినిమాను రూపొందిస్తున్నారు డైరెక్డర్ క్రిష్‌. ప్యాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హరిహర వీరమల్లులో పవన్‌ కళ్యాణ్ కు జోడీగా నిధీ అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భీమ్లా నాయక్ సంక్రాంతికి విడుదల అవుతుండగా, ఆ తరువాత మూడు నెలలకు 2022 ఏప్రిల్ 29న హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.