వెండి ప్రియులకు శుభవార్త, భారీగా తగ్గిన వెండి ధర

10గ్రా 22 క్యారెట్ 100 రూపాయలు పెరిగింది.
10గ్రా 24 క్యారెట్ 110 రూపాయలు పెరిగింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,900.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,990.
కిలో వెండి 4,200 తగ్గింది.
1కిలో వెండి 67, 200

బిజినెస్ డెస్క్- ఈ రోజు గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. బుధవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 10 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 11 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 100 రూపాయలు పెరిగి 44 వేల 900 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 110 రూపాయలు పెరిగి 48 వేల 990 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధర భారీగా తగ్గింది. కిలో వెండి 4200 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 67 వేల 200 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 350 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 380 రూపాయలు తగ్గింది.

silver 1 1

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 300 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,420 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,850 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,850 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,960 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,230 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.