హైదరాబాద్ లో  స్వల్పంగా పెరిగిన  బంగారం, వెండి ధర

స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 250 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 280 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 46,150.
24 క్యారెట్ 10గ్రా బంగారం 50,350.
1కిలో వెండి 71,150

బిజినెస్ డెస్క్– ఈ రోజు మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 25 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 28 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 250 రూపాయలు పెరిగి 45 వేల 150 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 280 రూపాయలు పెరిగి 50 వేల 350 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధర కిలో 500 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 70 వేల 150 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1040 రూపాయలు  పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 1140 రూపాయలు పెరిగింది.

Gold 1

ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 46 వేల 500 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 50,730 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47 వేల 920 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48 వేల 920 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,240 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 52,610 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.  రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.