ఏనుగు బ్యాటింగ్‌ – క్రికెటర్ మైఖేల్ వాన్ కామెంటరీ

సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మాజీ ఇంగ్లిష్‌ క్రికెటర్ మైఖేల్ వాన్.. రకరకాల మీమ్స్, వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో ఏనుగు బ్యాటింగ్ చేస్తూ అల‌రిస్తోంది. కొంత మంది యువ‌కులు పెద్ద ఏనుగుకు బంతులు విసురుతుండ‌గా.. మ‌రికొంద‌రు ఫీల్డింగ్ చేస్తున్నారు. తొండంతో బ్యాచ్ ప‌ట్టుకుని అనుభ‌వజ్ఞుడైన క్రికెట‌ర్ మాదిరిగా అన్ని బంతుల‌ను ఆడేస్తూ ఏనుగు ఆక‌ట్టుకున్న‌ది. జ‌ట్టు స‌భ్యులతో క‌లిసి హాయిగా క్రికెట్ ఆడుతున్న ఏనుగు వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

elephantcricket


ఐపీఎల్‌లో ఆటగాళ్ల బ్యాటింగ్‌ చూడకపోతే ఏం..ఈ ఏనుగు బ్యాటింగ్‌ చూడండి అంటూ ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దేశంలో కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే. పలు జట్లలోని 9 మంది క్రికెట్లరకు కరోనా సోకడంతో ఐపీఎల్‌ రద్దు చేస్తూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ప్రకటన విడుదల చేశారు. దీంతో ఐపీఎల్‌ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.ఈ క్రమంలో మైకేల్‌ వాన్‌ ఓ వీడియోను షేర్‌ చేశారు. అవును నిజమే! నేషనల్‌ ప్లేయర్స్‌ కంటే ఇదే బాగా అడుతుంది. తప్పకుండా ఇంగ్లండ్‌ పాస్‌ పోర్ట్‌ ఇప్పిస్తాం అని రీట్వీట్‌ చేశారు. అయితే, ఆ వీడియోలో ఓ ఏనుగు బ్యాటింగ్‌ చేస్తుంటే, దాని యజమాని బౌలింగ్‌ చేస్తున్నాడు. యజమాని బాల్‌ ఎలా వేసినా ఏనుగు మాత్రం తన అద్భుతమైన బ్యాటింగ్‌తో నెటిజన‍్లని కట్టిపడేస్తుంది. కాగా, వాఘన్‌ వీడియోలపై ‘పిచ్ సరిగా లేదు.. ఇంగ్లాండ్ ఆటగాళ్ళు దానిపై ఆడలేరు’ అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేస్తుంటే.. ఏనుగు బ్యాటింగే దెబ్బకు ఐపీఎల్‌ పనికిరాదు క్రికెట్‌ బాగా ఆడుతుందంటూ మరో నెటిజన్‌ వేశాడు.