కుక్కలు కరోనాని గుర్తించగలవా? వెలుగులోకి షాకింగ్ నిజాలు!

కరోనా.. ఇప్పుడు ఎక్కడ పట్టినా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు. ఏ ముహూర్తాన ఈ వైరస్ ప్రజల మధ్యకి వచ్చిందో.., అప్పటి నుండి మానవాళికి కష్టాలు మొదలయ్యాయి. ఒకప్పటిలా ఇప్పుడు ఎవ్వరి జీవితం లేదు. అందరి జీవితాలు తలక్రిందులు అయిపోయాయి. ఆప్తులను కోల్పోయిన వారు కొందరు, హాస్పిటల్స్ బిల్స్ కట్టలేక ఆస్తులు పోగొట్టుకున్న వారు కొందరు.., ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డవారు ఇంకొందరు. ఇంత బీభత్సం కొనసాగుతోన్న శాస్త్రవేత్తలు ఈ వైరస్ అంతాన్ని కనిపెట్టలేకపోతున్నారు. మనిషికి కరోనా ఉందా? లేదా? ని తెలుకోవడానికి కూడా ఇప్పటికీ బోలెడు టెస్ట్ చేసి తెలుకోవాల్సిన పరిస్థితి. కానీ.., కుక్కలు తమ కంటితో చూసి కరోనా పాజిటివ్ పేషంట్ ని గుర్తించగలవా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా వైరస్ బారిన పడిన రోగి శరీరం నుంచి వచ్చే చెమట వాసన ప్రత్యేకంగా లక్షణాలు కలిగి ఉంటుందట. ఈ వాసన ఆధారంగా కుక్కలు వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించగలవట. లండన్ కు చెందిన పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయం తేలిందన్నారు. మనిషి చెమట వాసనతో కరోనా వైరస్ నిర్ధారించే శక్తి కుక్కలకు ఉందని తేల్చిన పరిశోధకులు వాటి ద్వారా కరోనా రోగులను గుర్తించడం ప్రారంభించారు. ఈ మేరకు ఇప్పటికే వాటికీ శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కుక్కలు సార్స్ సోకిన వ్యక్తులను గుర్తించగలవు. ఈ విషయం ఇప్పటికే ఋజువైంది. ఇప్పుడు ఇదే విధంగా కుక్కలు కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తులను గుర్తించగలవు అని లండన్ పరిశోధకులు వెల్లడించారు.

kuka 2కరోనా ఉన్న వ్యక్తుల మాస్క్ లు దుస్తులను సేకరించి ఈ పరిశోధన చేపట్టారు. అయితే కుక్కలకు శిక్షణ ఇస్తే కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తాయని పరిశోధనలలో స్పష్టమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. పేలుడు పదార్థాలు బాంబులను ప్రమాదకర రసాయనాలను గుర్తించినట్టే.. ఒక వ్యక్తికి కరోనా సోకిందో లేదో గుర్తించే శునకాల వచ్చేశాయి. ఈ మేరకు కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తులో రోగ లక్షణాలు కనిపించక ముందే వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించేలా కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చారు. మనుషుల్లో మలేరియా పార్కిన్సన్స్ క్యాన్సర్ వంటి వ్యాధులను గుర్తించేలా గతంలో శునకాలకు శిక్షణ ఇచ్చిన నిపుణులు ఇందులో భాగస్వాములు అయ్యారు. కాగా విమానాశ్రయాల్లో రైల్వే స్టేషన్ ల వద్ద కుక్కులు సుమారు 91 శాతం పాజిటివ్ కేసులను గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ జాగిలాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని అంటున్నారు. ఇప్పటికే క్యాన్సర్ నిర్ధారణ కోసం పలు దేశాల్లో శునకాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ట్యూమర్స్ క్యాన్సర్ పసిగట్టేందుకు శునకాలు వాడేవారు. ఆ తర్వాత డయాబెటిస్ తదితర వ్యాధుల నిర్ధారణ కోసం కూడా శునకాలను వాడుతున్నారు. ప్రస్తుతం ట్రైనింగ్ ఇచ్చి కుక్కలని కరోనా ను గుర్తించడానికి వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదేమైనా.. భారీ సంఖ్యలో కోవిడ్ టెస్ట్ లు చేయాల్సిన అవసరం ఉన్న దగ్గర ఇలా ట్రైనింగ్ తీసుకోబడిన కుక్కలు బాగా ఉపయోగపడుతాయి అని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.