ప్రియుడి ప్రేమ కోసం యువకుడి ఆరాటం.. పెళ్లి చేసుకుంటానంటూ.. దారుణం..!

boy killed family

అది హర్యానాలోని రోహ్తక్‌ ప్రాంతం. తల్లిదండ్రులతో పాటు ఉంటున్న అభిషేక్ అలియాస్ మోనూకు కార్తీక్ అనే స్నేహితుడు ఉన్నాడు. వారిద్దరి మధ్య స్నేహం రోజు రోజకు ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు ఇష్టపడ్డారు. ఒకరి నుంచి ఒకరు విడిచి ఉండలేనంతగా తయారైపెళ్లిచేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో కార్తీక్ అభిషేక్ ను అమ్మాయిగా మారటానికి ఆపరేషన్ చేసుకోవాలని చెప్పాడు.

అభిషేక్ లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో అదే ఆలోచనతో కదిలిన అభిషేక్ తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పి డబ్బులు కావాలన్నాడు. ఈ వార్తతో ఖంగుతిన్న అభిషేక్ తండ్రికి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. కానీ ఎంత చెప్పినా కుమారుడి ఆలోచనకు నిరాకరించాడు అభిషేక్ తండ్రి. ఇది గ్రహించి వెంటనే ఆస్తి మొత్తాన్ని తనకూతురి పేరిట రాశాడు. ఏం చేయాలో తెలియక అమ్మకు, నాన్నమ్మకు, సోదరికి అందరికీ చెప్పి డబ్బులు కావాలన్నాడు. దీనికి అందరూ నిరాకరించటంతో మనస్థాపానికి గురయ్యాడు.

boy killed familyప్రియుడు కార్తీక్ మీద మాత్రం ప్రేమ రోజు రోజుకు రెట్టింపవుతోంది. ఆపరేషన్ కు డబ్బులు లేకపోవటంతో ఏం చేయాలో తెలియక తికమకలో పడ్డాడు. కాదన్నకుటుంబంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇక మొత్తానికి కుటుంబంలోని అందరినీ చంపాలనే పథకం వేసుకున్నాడు. దీంతో ఇదే ప్లాన్ తో కదిలిన అభిషేక్ దాచిపెట్టుకున్న గన్ తో తల్లిదండ్రులతో పాటు సోదరిని,నాన్నమ్మను కాల్చి చంపేశాడు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడైన అభిషేక్ ని అరెస్ట్ చేశారు.

విచారణలో ఉన్న అభిషేక్ తన ప్రియుడు కార్తీక్ కోసం ప్రాణాలు పోయేలా ఏడ్చాడు. నా ప్రియుడు కార్తీక్ ను ఒక్కసారైన చూడనివ్వండి అంటూ అరుపులు, కేకలతో రచ్చ రచ్చ చేశాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడికి పోలీసులు సైకియాట్రిస్టుతో కౌన్సిలింగ్ ఇప్పించారు. ఇక అనంతరం పోలీస్ యంత్రాంగం అభిషేక్ ను రిమాండ్ కు తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక అభిషేక్ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.