నాగల్‌కర్నూల్ జిల్లా కోడూర్ మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన మహిళ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట శివారులో తన భర్తతో కలిసి ఓ గోదాములో ఉంటున్నారు. అక్కడే ఉంటూ భార్యాభర్తలిద్దరూ పనిచేస్తున్నారు. అయితే ఈ నెల 9న సాయంత్రం ఆరు గంటలకు ఆమె భర్త లేని సమయంలో హరీశ్ గౌడ్ అనే వ్యక్తి గోదాం ప్రహరీ దూకి మహిళ ఇంట్లోకి వెళ్లాడు. వివాహితపై అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించటంతో కర్రతో ఆమె తలపై కొట్టడంతో ఆ మహిళ అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఇటీవల జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: Annamayya district: విద్యార్థినిపై కన్నేసిన లెక్చరర్.. ఎక్కువ మార్కులు వచ్చేలా చూస్తానంటూ!
అయితే భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేపట్టి ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. ఈ హత్య కేసు విచారణకు ఏసీపీ ఉదయ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్సైలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళపై దాడి జరిగిన ప్రదేశాన్ని పోలీసులు పరిశీలించారు. అయితే నిందితుడు అక్కడే చెప్పులు వదిలేసి వెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ చెప్పులను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటికి సిమెంట్ అంటి ఉండడంతో నిందితుడిని పట్టుకునేందుకు సులువుగా మారింది.
కాగా స్థానికంగా ఉంటున్న డెయిరీ లేబర్ రూంలో ఉన్న వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. వారు పని చేస్తున్న ప్రదేశానికి వెళ్లి అందరినీ పరిశీలించారు. అందులో హరీశ్ గౌడ్ అనే వ్యక్తి కాళ్లకు చెప్పులు లేకుండా పని చేస్తున్నాడు. దీంతో అనుమానమొచ్చిన పోలీసులు అతనిని ప్రశ్నించగా నేనే హత్య చేశానంటూ ఒప్పుకున్నాడు. ఇక నిందితుడిని పట్టుకున్న కోర్టులో హాజరు పరిచి అటు నుంచి జైలుకు తరలించారు. ఇటీవల జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.