భర్తతో పక్కింటి ఆంటీ క్లోజ్.. చుక్కలు చూపించిన భార్య

husband wife

అది మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్ పరిధిలోని కణ్హే గ్రామం. పింకీ అనే మహిళకు కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. దీంతో భర్తతో అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలో అనుమానం పెనుభూతంగా మారింది. భర్త సంగీత అనే పక్కింటి మహిళతో సన్నిహితంగా మెలుగుతు ఉండటంతో భార్యకు కోపం కట్టలు తెంచుకుంది. భర్త ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని భావించి సంగీతపై పగ పెంచుకుంది.

రోజు తన భర్తతో సంగీత మాట్లాడుతుండటంతో అనుమానం కలిగింది. దీంతో భరించలేని అగ్రహంతో ఆ మహిళతో సంగీతతో గొడవకు దిగేది. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఓ రోజు సంగీత ఇద్దరు పిల్లలు అన్షు (4), అనన్య (2)తో మంగళవారం ఉదయం కూరగాయల మార్కెట్ కు వెళ్లింది. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలోనే వాళ్లు పింకీ కంటికి కనిపించారు. అక్కడే పింకీ సంగీతతో గొడవకు దిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన పింకీ సంగీతతో పాటు ఇద్దరి పిల్లలను నీటి బావిలోకి తోసేసింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మరణించారు.

husband wifeఇక క్షణికావేశంలో పింకీ తీసుకున్న ఈ దారుణమైన నిర్ణయంతో అబం శుభం తెలియని ఇద్దరు చిన్నారు శవాలుగా మారారు. ఈ ఘటనతో ఖంగుతిన్న పింకీ అక్కడి నుంచి పరారై కనిపించకుండా పోయింది. చివరికి ఈ విషయం పోలీసుల వరకూ వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు నిందితురాలి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక ఈ ఘటనలో పింకీ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.