తెల్లనవి అన్నీ పాలు కాదు, నల్లనవి అన్నీ నీళ్లు కాదు. ఈరోజు సొంత వారిని కూడా గుడ్డిగా నమ్మడం పాపం అయిపోయింది. నా భార్యే కదా అని నమ్మిన భర్తకి ఈ భార్య నరకం చూపించింది. పేరు మాత్రం మృదువుగా మృదులా అని పెట్టుకున్న ఈ కిలాడీ.. స్త్రీ జాతి మొత్తం తలదించుకునే పాడుపని చేసి.. ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. విశాఖలోని మధురవాడ రిక్షాకాలనీకి చెందిన బుడుమూరు మురళి వయసు 43 సంవత్సరాలు. కాస్త ఉన్నతమైన కుటుంబం. పెళ్లి సంబంధాల సమయంలో అతనికి మృదుల బాగా నచ్చేసింది.
కానీ.., ఇద్దరి మధ్య వయసు చాలా తేడా ఉంది. మురళి కష్టపడి అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించాడు. వయసు గురించి ఆలోచించకండి. మీ అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూసుకుంటా అని మాట ఇచ్చాడు. దీంతో.. కొన్నేళ్ల క్రితం మురళి, మృదల పెళ్లి జరిగిపోయింది. పెళ్ళైన కొన్నాళ్ళకి మురళిపై బాధ్యతలు పెరిగాయి. భార్య కోరికలు పెరిగాయి. దీంతో.. మురళీ ఆఫ్రికాలో ఈస్ట్ ఆఫ్రికాలోని ఇరిట్రియా ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోప్రొఫెసర్ గా జాయిన్ అయ్యాడు. 8 ఏళ్లుగా అక్కడే ఉద్యోగం. కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా భార్య అకౌంట్ లోకి మళ్లించే వాడు.
ఇది కూడా చదవండి: పెళ్లైన మహిళపై మనసుపడ్డాడు.. ఎలాగైన ఆ కోరిక తీర్చుకోవాలని!
మృదుల ఇక్కడ తన పేరు మీద ఆస్తులు పెంచుకుంటూ వచ్చింది. ఇంత వరకు అంతా బాగానే ఉన్నా.., కొన్నాళ్ల క్రితం మృదుల మనసులో పాడు బుద్ది పుట్టుకొచ్చింది. భర్త తన కోసమే కదా అంత దూరం వెళ్లి కష్టపడుతున్నాడు అన్న జ్ఞానం లేకుండా.. ప్రియుడితో పక్క సుఖానికి అలవాటు పడింది. పాపం ఇవన్నీ తెలియని భర్త మురళి ఈ నెల 9న భార్యని చూసుకోవాలని, ఆమెతో కొన్నాళ్ళు ఆనందంగా గడపాలని ఆఫ్రికా నుండి ఇండియాకి వచ్చాడు. కానీ.., మృదులకి మాత్రం భర్త తన దగ్గరికి రావడం నచ్చలేదు. అన్ని రోజులు ప్రియుడికి దూరంగా ఉండలేకపోయింది.
దీంతో.. తమ బంధానికి మురళి అడ్డు లేకుండా చేసుకోవాలని ప్రియుడితో కలిసి భర్తని దారుణంగా చంపేసింది. చనిపోతూ.. భార్య అసలు రూపం తెలిసి మురళి విలవిలలాడిపోయాడు. కానీ.., అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక భర్తని చంపేసిన మృదుల అతని మృతదేహాన్ని ప్రియుడితో కలిసి బైక్ పై తీసుకెళ్లి మారికవలస బ్రిడ్జి కింద పడేసింది. అక్కడితో ఆగకుండా భర్త కనిపించడం లేదంటూ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది.
కానీ.., పోలీసుల రంగ ప్రవేశంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. వారు సేకరించిన కాల్ డేటా ఆధారంగా మృదుల అక్రమ సంబంధాన్ని తెలుసుకున్నారు. ఇక తరువాత పోలీసులు తమదైన స్టయిల్ లో విచారించగా మృదుల, ఆమె ప్రియుడి చేసిన దారుణాన్ని అంగీకరించారు. దీంతో.. మృదుల చేసిన ఈ దారుణం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. చూశారు కదా? డబ్బు కోసం భర్త, సుఖం కోసం ప్రియుడు అంటూ.. బరి తెగించిన ఈ భార్యకి ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.