వివాహేతర సంబంధం.. ఇవే పచ్చటి కాపురాల్లో నిప్పులు పొస్తున్నాయి. మహిళ అందంగా కనిపిస్తే చాలు, పెళ్లైనా, పిల్లలున్నా సరే.. ఎలాగైన లోబరుచుకుని కోరికలు తీర్చుకోవాలని చూస్తారు. ఆ మహిళ ఓకే చెప్పిందా సరే, లేదంటే
మహిళ భర్తను కానీ, మనసుపడ్డ మహిళను కానీ అంతమొందిచేందుకు చూస్తారు. ఇక విశాఖపట్నంలో అచ్చం ఇలాగే బరితెగించిన ఓ దుర్మార్గుడు వివాహేతర సంబంధానికి మహిళ అంగీకరించడం లేదని ఆమె భర్తను దారుణంగా హత్య చేశాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దువ్వాడకు చెందిన నామాల సురేష్ (38), రష్మిక భార్యాభర్తలు. వీరికి గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. దీంతో వీరి కాపురం ఎంతో అన్యోన్యంగా సాగుతూ ఉంది. అయితే సంతోషంగా సాగుతున్న సంసారాన్ని నాశనం చేయాలని చూశాడు స్థానికంగా ఉండే అఖిల్ అనే దుర్మార్గుడు. అఖిల్ గత కొంత కాలం నుంచి రష్మికపై మనసుపడ్డాడు. ఎలాగైన ఆమెను లొంగిదీసుకోవాలని భావించి వివాహేతర సంబంధానికి పావులు కదిపాడు. కానీ ఆ మహిళ అతని వేధింపులకు తలొగ్గలేక నిరాకరించింది. దీంతో వేధింపులు ఎక్కువవడంతో సురేష్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయినా కూడా అఖిల్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఇలా కాదని భావించిన సురేష్ దంపతులు అక్కడి నుంచి షీలానగర్ కు మకాం మర్చారు. అఖిల్ కొన్ని రోజుల తర్వాత వారున్న జాడను వెతికిపట్టి షీలానగర్ లో కాపురం పెట్టిన రష్మిక ఇంటికి వెళ్తుండేవాడు. అలా వెళ్లడంతో సురేష్ కు, అఖిల్ కు మధ్య ఓ గొడవ కూడా జరిగింది. దీంతో అఖిల్ సురేష్ పై మరింత పగ పెంచుకున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల అఖిల్ వాళ్లు ఉంటున్న ఇంటికి వెళ్లి సురేష్ తో గొడవ పడి వెంట తెచ్చుకున్న రాడ్డుతో సురేష్ ను దారుణంగా హత్యచేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ దాడిలో రక్తపు మడుగులో పడి సురేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. భర్త మరణించడంతో రష్మిక తట్టుకోలేని శోకంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అయితే సురేష్ భార్యకు, అఖిల్ కు నిజంగానే వివాహేతర సంబంధం ఉందా? అస్సలు షీలానగర్ లో కాపురం పెట్టిన విషయం అఖిల్ కు ఎలా తెలిసింది? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. సురేష్ భార్య రష్మికను సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.