Crime News: విమాన ప్రమాదాలు జరగటం అన్నది సర్వ సాధారణం. ఎలాంటి చిన్న సాంకేతిక లోపం వచ్చినా విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ముఖ్యంగా గాల్లో ఉన్నపుడు లేదా రన్‌వేపై రాకపోకలు సాగిస్తున్నపుడు ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ, గాల్లో ఉండగా ఓ రెండు విమానాలు ఢీకొట్టుకోవటం, రన్‌వేపై రెండు విమానాలు ఢీకొట్టుకోవటం వంటివి చాలా అరుదు. తాజాగా, అమెరికాలోని ఓ విమానాశ్రయం రన్‌వేపై రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. నార్త్ లాస్ వేగాస్ ఏయిర్ పోర్టులో ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
రన్‌వే పై టేకాఫ్ అవుతున్న ఓ సింగిల్ ఇంజిన్ విమానం వేగంగా వెళ్లి మరో విమానాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఓ విమానం నేలపై ముక్కలై పడగా.. మరో విమానం అక్కడే ఉన్న ఓ నీళ్ల తొట్టెలో పడింది. ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి, ఈ ఘటన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
BREAKING NEWS: Reports are two aircraft collided at North Las Vegas Airport just now 🚨🚨🚨🚨 pic.twitter.com/aDtlvvyDWL
— 702MEMES (@702MemesLV) July 17, 2022
ఇవి కూడా చదవండి : బ్రేకింగ్: ఘోర ప్రమాదం.. 40 మందితో నదిలో పడిన బస్సు!