ట్యూషన్ పంతులు కీచక లెక్కలు.. స్పెషల్ ట్రైనింగ్ అంటూ బాలికపై..!

teacher harassment

విద్యా బుద్దులు నేర్పాల్సిన కొందరు టీచర్స్ యువతులపై కన్నేస్తూ శారీరక కోరికలను తీర్చుకుంటున్నారు. అబం శుభం తెలియని కొందరి అమాయకపు అమ్మాయిలను చదువు పేరుతో నమ్మిస్తూ అత్యాచారాలకు తెగ బడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని గంట్యాడ ప్రాంతానికి చెందిన కొంతమంది బాలికలు మూడేళ్ల నుంచి ట్యూషన్ నిమిత్తం స్థానికంగా ఉండే ఓ పెళ్లైన మాస్టారు వద్దకు వెళ్తూ ఉండేవాళ్లు. కానీ ఈ కామ టీచర్ తెర వెనుక కీచక ఆలోచనలను మాత్రం వీళ్లు పసిగట్టలేకపోయారు.

ఇక ఈ మాస్టారు ఓ 10 తరగతి బాలికపై కన్నేశాడు. రాత్రి ట్యూషన్ అయిపోయిన వెంటనే అందరూ పిల్లలు వెళ్తుంటే ఆ బాలికను పిలుచుకుని.. నీకు తెలివి లేదు, నీకు స్పెషల్ క్లాసులున్నాయంటూ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అలా ఎన్నో మాయమాటలు చెప్పి ఆ బాలికపై తన కోరికలను తీర్చుకుంటూ వస్తున్నాడు. ఇక కొన్ని రోజుల నుంచి బాలిక ఆరోగ్య పరిస్థితి బాగులేకపోవటంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది.

teacher harassmentదీంతో టెస్ట్ లు చేసిన వైద్యులు బాలిక గర్భవతి అని తేల్చారు. దీంతో ఒక్కసారిగా ఖంగుతిన్న తల్లిదండ్రులు ఆ బాలిక నుంచి అసలు విషయాన్ని రాబట్టారు. దీంతో వెంటనే ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు ఆ ట్యూషన్ మాస్టారును అరెస్ట్ చేశారు. ఇలా చదువు పేరుతో బాలికను శారీరకంగా వేధించిన ఈ కీచక టీచర్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.