ఆశలన్నీ ఆవిరి.. ఆగిన నవదంపతుల ఊపిరి..!

నిండు నూరేళ్లు జీవితాన్ని హాయిగా గడపాలని, ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు ఆ నవదంపతులు.  ఆ ఆశలని ఆవిరి చేస్తూ.. వారి మనస్సుకు ఏమి అనిపించిందో ఏమో నెలరోజుల్లోనే  ఇద్దరు ఆత్మహత్యకు పాల్పపడ్డారు. ఈ హృదయవిదారకమైన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.

image 0 compressed 58పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పసుపులేటి రాజా, రత్నమ్మ దంపతుల కుమార్తె అంజలి(22)ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం కుమ్మకుంటకు చెందిన యువకుడితో గత ఏడాది ఆగష్టులో వివాహం జరిపించారు. వివాహమైన నాలుగు నెలలకే అంటే డిసెంబరులో అంజలి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని జీర్ణించుకులేని అంజలి కొన్ని రోజులుగా మనోవేదనకు చెందుతుంది. భర్తలేని తన జీవితంపై విరక్తి చెందిన అంజలి మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నెలరోజుల్లోనే నవదంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ రెండు కుటుంబాలు తట్టుకోలేకపోతున్నాయి. పోలీసులు సంఘటన స్థలాన్నికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాపూరుకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇది చదవండి : హైదరాబాద్ నడిరోడ్డుపై మహిళ దారణ హత్య.. పరుగులు తీసిన జనం

కొత్త జీవితం ఏన్నో ఆశలు పెట్టుకొన్ని ఏవో జరిగిన చిన్న సంఘటనలతో క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని మూడ్నాళ్ల ముచ్చట చేసుకున్నారు ఆ నవదంపతులు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.