ప్రకాశం జిల్లాలో దారుణం! ప్రియుడి మోజులో పడి కూతురిని చంపేందుకు సహకరించిన తల్లి!

crime on daughter

వివాహేతర సంబంధం.. సంతోషంగా సాగుతున్న వైవాహిక జీవితాల్లో చిచ్చురేపుతూ చివరికి బంధాలను సంబంధం లేకుండా చేస్తుంది. కొందరు భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకరు తెరచాటు సంసారాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పచ్చటి సంసారాల్లో నిప్పులు రాజేసుకుంటున్నారు. ఈ విషయంలో చివరికి ఎవరు అడ్డుగా కనిపించిన వారినే కనిపించకుండా చేయడానికి కూడా వెనకాడడం లేదు. అచ్చం ఇలాంటి దారుణ ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రియుని మోజులో పడి ఏకంగా కన్న కూతురి హత్యకే సహకరించింది ఓ తల్లి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లింగసముద్రం మండలం తిమ్మారెడ్డిపాలెంలోని వేటపాలెంలో ఈసునూరి మాధవి అనే మహిళ నివాసం ఉంటుంది. మాధవికి 15 ఏళ్ల కూతురు కూడా ఉంది. గత 18 ఏళ్లుగా ఏన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న మాధవికి భర్తతో విభేదాలు రావడంతో కొంత కాలం నుంచి అతనికి దూరంగా ఉంటుంది. అలా సాగుతున్న క్రమంలోనే జంగారెడ్డి పాలేనికి చెందిన వివాహితుడు సుంకర శ్రీకాంత్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకి వివాహేతర సబంధానికి దారి తీసింది.

Crime wife and Husband - Suman TVఅలా వీరిద్దరు శారీరకంగా కూడా కలుసుకుంటున్నారు. ఇక ప్రియుని మోజులో పడ్డ మాధవి సమయం దొరికినప్పుడల్లా అతనితో గడపడం, వచ్చిన జీతమంతా అతనికి దారపోయడం చేస్తుంది. అయితే 10వ తరగతి పూర్తి చేసిన మాధవి కూతురి ప్రశాంతికి నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సీటు రావడంతో అక్కడ 60 వేలు కట్టాల్సి వచ్చింది. దీంతో సమయానికి డబ్బులు లేవనడంతో కూతురు ప్రశాంతి ప్రియునికి డబ్బులు ఎందుకు ఇచ్చావంటూ నిలదీసింది. ఈ విషయం కాస్త మెల్లగా ప్రియుడు శ్రీకాంత్ చెవిన పడింది. ఇలా అయితే నా పప్పులు ఉడకవని భావించిన శ్రీకాంత్ ప్రియురాలి సాయంతో ప్రశాంతి హత్యకు ప్లాన్ వేశాడు. అనుకున్నట్లుగానే ఈ నెల 23న ఉదయం 7 గంటలకు నిద్రలో ఉన్న ప్రశాంతిని గొంతునులిమి చంపేశారు.

ఇక గుట్టుచప్పుడు కాకుండా అదే రోజు రాత్రి అటవీ ప్రాంతంలో కాల్చేశారు. పూర్తిగా కాలలేదని భావించిన సదరు నిందితులు గుంత తొవ్వి పూర్తిగా మట్టితో పూడ్చేశారు. దీంతో ఈ విషయం చివరకు పోలీసుల వరకు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు విచారణలో ఎట్టకేలకు ప్రశాంతిని చంపిన నిందితులైన మాధవి, శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రశాంతిని హత్యచేసింది మేమే అంటూ ఒప్పుకున్నారు. ఇలా ప్రియుని మోజులో పడి ఎంతో మంది మహిళలు చివరికి కన్నవాళ్లను కాదనుకుంటు కడతేర్చుతున్నారు. ఇక ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ కేసులో మాధవి చేసిన ఘాతుకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిజేయండి.