కులాలు వేరంటూ పంచాయితిలో పెద్దల తీర్పు.. అంతలోనే దారుణం!

ramesh

నేటి సమాజంలో కులాల కుంపటి ఇంకా రాజ్యమేలుతూనే ఉన్నాయి. ఆనాటి కాలంలో తక్కువ కులం వారంటూ దళితులను ఉరి చివరన ఉండాలంటూ సామాజికంగా భాహిష్కరించటం వంటివి ఎన్నో దారుణాలు చూశాం. అలాంటి దారుణాలు ఇప్పటికి కొనసాగకపోయిన కులాల పేరుతో ప్రేమించిన వ్యక్తులను దూరం చేస్తున్నారు. దీంతో తట్టుకోలేని కొందరు యువతి యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది గజ్వేల్‌ మండలం అహ్మదీపూర్‌ గ్రామం. ఇదే గ్రామానికి చెందిన ఎర్ర రమేశ్‌ (21) అనే యువకుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఇదే గ్రామంలోని ఓ యువతిని ప్రేమించాడు. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి కూడా చేసుకోవాలని భావించారు. ఇంతలోనే వీరిద్దరి విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. ఏం చేయాలో అర్థంకాక గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితి పెట్టించారు. ఇక పెద్దల తీర్పులో భాగంగా సర్దిచెప్పి కులాలు వేరు కావడంతో విడగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు.

ఇక ఇద్దరు కూడా ఇక నుంచి మాట్లాడడం కానీ కలుసుకోవటం కానీ చేయకూడదంటూ సంచలన తీర్పు వెలువరించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యువకుడు ఎర్ర రమేష్ సోమవారం పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక నేటి కాలంలో కూడా ఇలాంటి కులాల గజ్జితో వెంపర్లాడుతున్న సమాజంలో అభం శుభం తెలియని ఓ అమాయక యువకుడ మరణించటం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.