ములుగు జిల్లాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. చిన్న పాటి గొడవల విషయంలో ఏకంగా కాల్పుల వరకు వెళ్లి చివరికి కానిస్టేబుల్ తూటాలకు ఎస్సై బలైన ఘటన తాజాగా సంచలనంగా మారింది. ఇక విషయం ఏంటంటే.. ములుగు జిల్లా వెంటకటాపురం సీఆర్‌పీఎఫ్ 39వ బెటాలియన్ క్యాంప్ జరుగుతుంది. అయితే క్యాంపులో బాగంగా మెస్ ఇన్‌చార్జిగా హెడ్ కానిస్టేబుల్ స్టీఫెన్ ఉన్నారు. అయితే ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో మెస్ ఛార్జీల విషయంలో కానిస్టేబుల్ స్టీఫెన్ తో సీఆర్‌పీఎఫ్ ఎస్సై ఉమేశ్‌చంద్ర వాగ్వాదానికి దిగాడు.
దీంతో ఇద్దరి మధ్య కాసేపు గొడవ హద్దులు దాటడంతో ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇక వివాదం తీవ్ర రూపం దాల్చడంతో కోపంతో ఊగిపోయిన కానిస్టేబుల్ స్టీఫెన్ ఏకే 47 గన్‌తో ఏకంగా సీఆర్‌పీఎఫ్ ఎస్సై ఉమేశ్‌చంద్రపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. దీంతో భయంతో కానిస్టేబుల్ తనపై తానే కాల్పుల జరుపుకున్నాడు. ఈ విషయం తెలుసున్న సీఆర్‌పీఎఫ్ అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఎస్సైని, కానిస్టేబుల్ ని ఆస్పత్రిలో చేర్పించారు.
ఎస్సైకి చికిత్స అందించిన వైద్యులు అప్పటికే మరణించాడని తెలిపారు. ఇక తనను తాను కాల్చుకున్న కానిస్టేబుల్ ను మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ములుగు ఎస్పీ సం గ్రామ్‌సింగ్ పాటిల్ ఎస్సై మృతదేహాన్ని పరిశీలించారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కానిస్టేబుల్ ఏకంగా ఎస్సైపై కాల్పులు జరిపిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.