భర్తను వదిలేసిన భార్య.. ఇంత దారుణం జరుగుతుందని అస్సలు ఊహించలేదు

man killed his lover

వివాహేతర సంబంధం.. భార్యాభర్తలు ఒకరికి తెలియకుండా ఒకరు పడక సుఖానికి అలవాటు పడి పరాయి వాళ్లతో శారీరక సుఖాలు తీర్చుకుంటున్నారు. ఇంతకే ఆగుతున్నారా అంటే అదీ లేదు. ప్రియుని మైకంలో పడి ఎవ్వరు అడ్డొచ్చిన వారిని అంతం చేయడానికి కూడా వెనకాడని పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి వివాహేతర సంబంధాలే సంతోషంగా సాగుతున్న కాపురంలో చిచ్చురేపుతూ చివరికి చూడకూడని దారుణాలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే అమరావతి చోటు చేసుకుంది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తుళ్లూరు మండలం మందడం గ్రామానికి చెందిన పత్తిపాటి నాగమణికి కొంతకాలం క్రితం పెళ్లైంది. భర్తతో పాటు సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో మెల్లగా భార్యాభర్తల మధ్య మెల్లగా గొడవలు మొదలయ్యాయి. దీంతో భర్త తీరు నచ్చక భార్య నాగమణి ఒంటరిగా నివాసం ఉంటుంది. అయితే కొంత కాలం తర్వాత నాగమణికి గ్రామ సచివాలయంలో పని చేస్తున్న డేవిడ్ రాజు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకి వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది.

దీంతో వీరిద్దరు శారీరక సుఖాలు తీర్చుకుంటూ కొన్ని రోజులు అలా గడుస్తూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే డేవిడ్ రాజు, నాగమణికి మధ్య డ్వాక్రా సంఘం డబ్బుల విషయంలో వివాదం రాజుకుంది. మాటకు మాట పెరగడంతో వివాదం కాస్త పెద్దదైంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన డేవిడ్ రాజు నాగమణిని గొంతు పిసికి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చివరికి ఈ స్టోరీలోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో డేవిడ్ రాజు ప్లాన్ వర్కౌట్ కావకపోవడంతో అతని వ్యవహారం బట్టబయలైంది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు డేవిడ్ రాజును అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. నాగమణి క్షణికావేశంలో భర్తతో జరిగిన గొడవతో సర్దిచెప్పుకోక చివరికి ప్రియుడి చేతిలో ఘోరంగా మరణించింది.