బిజినెస్ పనిమీద భర్త.. ప్రియుడి మోజులో భార్య!

Men And Women

ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య వివాహేతర సంబంధాలు కొత్త దారుల్లోకి వెళ్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి పోర్చుగల్ దేశంలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకే వెళ్తే.. జోసెఫ్ అనే వ్యక్తికీ మేరీ అనే అమ్మాయితో నాలుగేళ్ళ కిందట వివాహం జ‌రిగింది. అయితే వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కాగా ఇప్పటి వరకు ఎంతో ఆనందంలో సాగిన వీరి కాపురంలో కొత్త చిచ్చుకు తెర లేపింది భార్య మేరీ.

బిజినెస్ పని మీద భర్త బిజీగా ఉండడంతో భార్య మెల్లగా ట్రాక్ తప్పి పరాయి మగాడితో రొమాన్స్ కు కాలు దువ్వుంది. భార్య భర్తలేని సమయంలో అతడితో ఎంచక్క ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇక కొన్నాళ్లకి అసలు విషయం భర్తకు తెలియటంతో ఓ కన్నేసి ఉంచాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. ఇక ఎలాగైన భర్త జోసెఫ్ భార్యను వదిలించుకునేందుకు ఓ పథకాన్ని ప్రయోగించాడు. ఇంట్లోని బెడ్ రూంలో తన భార్యకు తెలియకుండా సీక్రెట్ గా సీసీ కెమెరాను అమార్చాడు. ఇక ప్లాన్ ను అమలు చేసేందుకు భర్త ఓ రోజు బిజినెస్ పని మీద బయటకు వెళ్తున్నానని భార్యకు చెప్పి ఇంటి గడప దాటాడు.

అయితే ఇదే అదునుగా భావించిన భార్య మేరీ ప్రియుడిని మెల్లగా ఇంటికి రప్పించుకుని బెడ్ రూంలోకి దూరిపోయింది. సీక్రెట్ సీసీ కెమెరా తెలియకపోవడంతో భార్య ప్రియుడితో ఎంజాయ్ హద్దులు దాటింది. ఇదే విషయంపై భార్యను ప్రశ్నించగా అలా ఏం లేదంటూ పెదవి విప్పింది. ఇక మనోడు ఊరుకుంటాడా.. మెల్లగా ఆ రికార్డ్ అయిన వీడియోలు తీసుకుని కోర్టుకు వెళ్లి విడాకులు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. న్యాయస్థానం ఇద్దరిని పిలిపించడంతో కోర్టు ముందు భార్య మేరీ నాటకాన్ని కాస్త నవరసాలుగా పండించింది. ఇక చివరికి కోర్టుకు కూడా అనుమానం రావడంతో జోసేఫ్, మేరీకి విడాకులు మంజూరు చేసింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక నమ్మిన భార్యను నట్టెట్ట ముంచిన భార్య తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.