కంత్రీ టిక్‌టాక్‌ జంట మోసం.. విదేశాల్లో చదువంటూ..

A Cheating Tik Tok Couples - Suman TV

దంపతులిద్దరూ సామాజిక మాధ్యమాల్లో మాంచి.. రొమాంటిక్‌ వీడియోలు చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో యువతను ఆకర్షించి వారితో పరిచయం పెంచుకుంటారు. ఆపై విదేశాల్లో చదివిస్తామంటూ వారి నుంచి వీలైనంత కాడికి డబ్బులు గుంచుతారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఈ ఘటన వెలుగుచూసింది. గాయత్రి, శ్రీధర్‌ అనే చీటింగ్‌ దంపతులు విదేశాల్లో చదివిస్తామని నమ్మబలికి గౌరీ శంకర్‌ అనే యువకుడి నుంచి 44 లక్షలు కొట్టేసి, ఉడాయించారు. ఈ విషయమై ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఇలాంటివి ఇంకా చాలా మోసాలు చేసినట్లు తెలిసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా మంది యువతను వీరు చీట్‌ చేసినట్లు సమాచారం.

A Cheating Tik Tok Couples - Suman TV