డ్రగ్స్‌ కేసులో కొత్త మలుపు.. సినీ తారాలందరికీ క్లీన్‌చిట్‌ లభించే చాన్స్‌?

Tollywood Drugs Case

టాలీవుడ్‌ డ్రగ్స్‌లో కేసులో కీలక సమాచారం లభించింది. డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌ ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా ఎక్సైజ్‌ శాఖ రూపొందించిన చార్జ్‌షీట్‌లోని కొన్ని విషయాలు బయటికొచ్చినట్లు సమాచారం. అందులో సినీ ప్రముఖలకు డ్రగ్స్‌ కేసుతో ఉన్న సంబంధాలను ప్రస్తావించింది. కేవలం కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో చార్జ్‌షీట్‌లో సినీ తారాలను నిందితులుగా చేర్చలేమని పేర్కొంది. కెల్విన్‌ చెప్తున్న విషయాలు నమ్మశక్యంగా లేవని, సినీ తారలు డ్రగ్స్‌ వాడుతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఎక్సైజ్‌ శాఖ చార్జ్‌షీట్‌లో తెలిపింది.

ఎక్సైజ్‌ సిటీ పోలీస్‌ శాఖ కెల్విన్‌ ఇచ్చిన వాగ్మూలం ప్రకారం సినీ ప్రముఖులను విచారించిందని, కానీ వాటికి బలమైన ఆధారాలు లభించలేదని పేర్కొంది. కేవలం కెల్విన ఇచ్చిన వాగ్మూలాన్ని మాత్రమే బలమైన ఆధారంగా తీసుకోలేం అని చార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. కాగా ఈ సమాచారంతో ఈ డ్రగ్స్‌ కేసులో విచారణ ఎదుర్కొన్న సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్‌ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, హీరో తరుణ్‌లు డ్రగ్స్‌ వాడలేదని ఎఫ్‌ఎస్‌ఎల్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.