మార్కుల పేరుతో విద్యార్థినికి టీచర్ బ్లాక్ మెయిల్! ఆడియో వైరల్!

Teacher Harrasment Student

“గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః”.. తల్లి, తండ్రి తరువాత స్థానం విద్యాబుద్దులు నేర్పే గురువుదే. అంతటి గొప్ప స్థానంలో మనం మన గురువుని కుర్చోపెట్టాం. అలాంటిది దేవుడిలా కొలిచే గురువు, విద్యాబుద్ధులు నేర్పాల్సిన దేవాలయంలో కీచక పర్వానికి తెరలేపాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Teacher Harrasment Student

తిరుపతిలో ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థినిని మార్కుల పేరుతో భయపెడుతున్న ఘటనకు సంబంధించిన ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. “నేను నిన్ను పాస్ చేపిస్తాను, కాకుంటే నేను చెప్పింది నువ్వు చేయాలంటూ కమిట్మెంట్ అడుగుతున్న ఆ ఆడియో అందరిని షాక్ కి గురి చేస్తోంది. అభం, శుభం తెలియని పసిమొగ్గల్ని చిదిమేయాలని చూసే ఇలాంటి దుర్మార్గుల్ని…గురువు అనాలా, రాక్షసుడు అనాలా అంటూ ప్రజలు తిట్టిపోస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.