హైదరాబాద్‌లో మరో దారుణం.. 14 ఏళ్ల బాలికను..

rape hyderabad 14yersgirl

రాష్ట్ర రాజధానిలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో గిరిజన బాలిక హత్యాచార ఘటన రెండు తెలుగురాష్ట్రాలను కుదిపేస్తోంది. ఇంకా ఆ నిందితుడు పోలీసుల చేతికి చిక్కనేలేదు. ప్రతి ఒక్కరూ ఈ దారుణ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. సవితి తండ్రి 14 ఏళ్ల కూతురిపై మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్న దారుణ ఘటనపై కేసు నమోదైంది. వివరాలు.. బండ్లగూడ గౌస్‌నగర్‌కు చెందిన మహిళకు 14 ఏళ్ల కుమార్తెతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
కాగా ఆమె భర్తతో విడాకులు తీసుకుని 2017లో అంబర్‌పేటకు చెందిన వ్యాపారి సయ్యద్‌ షరీఫ్‌ యూసుఫ్‌(45)ను వివాహం చేసుకుంది. అంబర్‌పేటలోని మొదటి భార్యతో నివాసం ఉండే యూసుఫ్‌ అప్పుడప్పుడు గౌస్‌నగర్‌కు వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల బాలికను బెదిరిస్తూ మూడేళ్లుగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. రెండు రోజుల క్రితం విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.