చేతబడి నెపంతో మామను దారుణంగా చంపిన అల్లుడు.. ఆ తర్వాత…

ప్రపంచం టెక్నాలజీ పరంగ ఎంత పురోగాభివృద్ది సాధిస్తుందో అందరికీ తెలిసిందే. నిత్యం ఏదో ఒక కొత్త ఆవిష్కరణలతో దేశం ముందుకు సాగుతుంటే.. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ మూఢ విశ్వాసాలతో ప్రజలు దుర్భరమైన జీవితాలు గడుపుతూనే ఉన్నారు. దేవుడు, దెయ్యం అంటే ఇప్పటికే భయం.. భక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు.

baga minముఖ్యంగా గ్రామాల్లో ఇప్పటికీ చేతబడి, బానామతి, మంత్రాలతో మనుషుల ప్రాణాలు తీస్తుంటారని జనాలు నమ్ముతూనే ఉన్నారు. తాజాగా చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వరుసకు అల్లుడైన వ్యక్తే తన మామను అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతే కాదు హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని గుట్టుగా పూడ్చివేయించడం కలకలం రేపుతుంది. ఈ ఘటన విజయనగరం జిల్లాలో ఈ దారుణ చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో కేండ్రుక ఉత్తర(57) అనే వ్యక్తి.. పొలంలో పనులు చేస్తోన్న తన భార్య చిలకమ్మకు భోజనం ఇవ్వడానికి వెళ్తున్నాడు.

అదే సమయంలో కేండ్రుక ఉత్తర కు వరుసకు అల్లుడైన కొండతామర నారప్ప దూరంగా ఉన్న ఓ జీడితోట వద్ద కర్రతో బలంగా కొట్టాడు. దాంతో ఒక్కసారే ఉత్తర కుప్పకూలిపోయాడు. అయితే ఈ విషయం బయట పడితే కేసు అవుతుందని భయపడి రాత్రికి రాత్రే.. దహన సంస్కరణలు చేశారు. మరోవైపు ఈ విషయం పోలీసులకు చెప్పేందుకు ప్రయత్నించిన‌ మృతుని తనయులను గ్రామ పెద్దలు నిలిపివేశారు. కానీ ఉత్తర తనయులు శనివారం ఉదయం పోలీసులకు కంప్లైంట్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ షన్ముకరావు స్టాఫ్‌తో అక్కడకు చేరుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.