సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారంపై ట్వీట్ చేసిన మహేశ్‌ బాబు!..

Mahesh Babu Emotional Tweet on 6 Year Old Girl Rape Case - Suman TV

ఇటీవల సైదాబాద్‌లో జరిగిన చిన్నారి హత్యాచార ఘటనపై టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేశ్‌ బాబు స్పందించారు. ‘ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో గుర్తు చేస్తున్నాయి. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ  ప్రశ్నగానే మిగిలిపోతుందా! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేం’ అంటూ మహేశ్‌ చాలా ఎమోషనల్‌ అయ్యారు. ఈ ఘటనపై త్వరగా చర్యలు తీసుకొని ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని మహేశ్‌ బాబు ట్విట్టర్ వేదికగా అధికారులను కోరారు.  సైదాబాద్ హత్యాచారం హత్య ఘటనపై పోలీసులు తీవ్రంగా స్పందించారు.

Mahesh Babu Tweet

సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం చేసి చంపిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతుండడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సిటీ పోలీసులు గతంలో ఎన్నడూలేనిరీతిలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితుడి సీసీ ఫుటేజీ, ఫోటోలు బయటకు వచ్చినా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేకపోయారంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు పెరుగుతన్న నేపథ్యంలో పోలీసులు నిందితుడు రాజుపై 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించారు.

నిందితుడు రాజుకు సంబంధించిన ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇచ్చారు. హైదరాబాద్  నగర పోలీస్ కమిషనర్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. రీసెంట్ గా  బాధిత కుటుంబాన్ని నటుడు మంచు మనోజ్ పరామర్శించారు. ఈ సందర్భంగా సాయి ధరమ్ తేజ్ రోడ్ యాక్సిడెంట్ అంశాన్ని ప్రస్తావించిన మనోజ్ మీడియాపై ఫైర్  అయిన సంగతికూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే.