భార్య చేసిన మోసానికి తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యాయత్నం

A Boy Committed Selfie Sucide Video Viral - Suman TV

అనుమానం, అక్రమ సంబంధం, ఆర్థిక పరిస్థితులు, చెడు వ్యసనాల జాఢ్యం పట్టి.. భార్యలను మానసికంగా, శారీరంగా హింసించి, దారుణంగా హత్యలు చేసే భర్తలను చూస్తున్నాం. బాధిత మహిళలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు లభిస్తుంది. వైవాహిక బంధాల్లో ఎక్కువగా బాధించబడే వర్గం భార్యలదే అయినా.. కొన్ని సందర్భల్లో భర్తలు కూడా భార్యల వేధింపులకు బలవుతున్నారు. భర్తను మోసం చేస్తూ వివాహేత సంబంధాలు పెట్టుకోవడమో, మానసికంగా భర్తలను హింసించడం, మితిమీరిన ఆర్థిక అవసరాలకు భర్తలను పీడించి వారి బలవంతపు మరణాలకు కారణమవుతున్న భార్యలను కూడా చూస్తున్నాం. కాకపోతే మహిళల విషయంలో లభించే మద్దతు.. బాధిత భర్తలకు లభించడం లేదనేది కఠిన వాస్తవం. భార్యల చేతిలో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది.

A Boy Committed Selfie Sucide Video Viral - Suman TVఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఒక యువకుడు తన భార్య చేతిలో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఏడుస్తూ తీసుకున్న సెల్పీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అమ్మా.. నేను ఇంక నీతో మాట్లాడలేను అమ్మ.. ఇదే లాస్టు మాట అమ్మ. నేను సచ్చిపోతున్నా.. మీరు మాత్రం నా గురించి ఆగం కావొద్దమ. ఇద్దరు తమ్ముళ్లను మంచిగా చూసుకో. జీవితంలో ఏమీ చూడకుండా, 24 ఏళ్లకే సచ్చిపోతున్న. నాకు చావాలని లేదు. నా భార్య కృష్ణవేణి నన్ను మోసం చేసింది. అందుకే చనిపోతున్న. నా శవాన్ని కూడా కృష్ణవేణిని ముట్టుకోనివ్వద్దు. నేను చనిపోయిన తర్వాత నా చేతిపై ఉన్న తన పేరు(పచ్చబొట్టు)ను తీసేసి నన్ను పూడ్చండి. అమ్మా నన్ను మంటల్లో కాల్చకండి. కొంచెం కాలిన నేను తట్టుకోలేను. అందుకే నన్ను గుంతలో పూడ్చండి. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు.’అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ యువకుడు తీసుకున్న సెల్పీ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తుంది. ఇలా భార్యలను అమితంగా ప్రేమించి వారి చేతిలో మోసపోయిన భర్తలు ఎలా న్యాయం జరగాలి. సర్వసం ఇల్లాలే అనుకున్న భర్తలను మోసం చేసే భార్యలను ఏమనాలి? దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.