ఇంతకాలం మనం మహిళలపై మగవారు యాసిడ్ దాడి చేసిన ఘటనలే చూస్తూ వచ్చాము. అయితే.. ఇప్పుడు మొదటిసారి ఓ అమ్మాయి అబ్బాయిపై యాసిడ్ పోసింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే. కేరళలోని అడిమళికి చెందని షీబా, పూజాప్పురాకు చెందిన అరుణ్.. ఇద్దరికి సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకి దారి తీసింది. కానీ.. షీబాకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని అరుణ్‌కు తరువాత తెలిసింది. అప్పటినుండి అరుణ్.. షీబాను దూరం పెడుతూ వచ్చాడు. కానీ షీబా మాత్రం తనను పెళ్లి చేసుకోమంటూ అరుణ్ వెంట పడింది. అరుణ్ రూ. 2 లక్షలు డబ్బు కూడా తీసుకుంది. డబ్బులు పోయినా పరవాలేదు అని అరుణ్ ఆమెని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో షీబా అరుణ్ పై కోపం పెంచుకుంది.
అరుణ్ కదలికలను గమనిస్తూ వచ్చిన షీబా.. తాను ఇరుంపుపళం వద్ద స్నేహితులతో ఉన్న సమయంలో తనపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఆ తర్వాత అక్కడ నుండి తప్పించుకుంది. తన స్నేహితులు అరుణ్‌ను తిరువనంతపురం మెడికల్ కాలేజ్‌కు తరలించారు. అక్కడి వైద్యులు యాసిడ్ దాడి వల్ల అరుణ్ కంటిచూపు పోయిందని నిర్దారించారు. చూశారు కదా.. ఇలాంటి అమ్మాయికి ఏ శిక్ష విధించాలి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి