కష్టపడి సంపాదించడంలో ఆనందం ఉంటుంది. అంతే కష్టం ఏం పడతాములో ఓవర్ నైట్‌లో కోట్లు సంపాదించాలంటే జులాయి సినిమాలో అల్లు అర్జున్‌లా అన్ని కష్టాలు పడాలి మరి. తేలీగ్గా డబ్బు రావడం అంటే అంతే తేలిగ్గా కష్టాలకు వెల్‌కమ్ చెప్పడమే అనమాట. అలా ఈజీ మనీ కోసం ప్రయత్నించి విజయవాడ సీతారామపురంలో ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఓ రైల్వే ఉద్యోగితో సహజీవనం చేస్తోంది. అతని ద్వారా పరిచయమైన ఉద్యోగులు, మిత్రులతో వ్యాపారం చేయడం ప్రారంభించింది. తక్కువ ధరకే బంగారం అమ్మడం అనమాట.
అలా కొంతకాలం సాఫీగానే వ్యాపారం సాగింది. కొన్నాళ్లకు మరి ఏమైందో గానీ, ఆమె డబ్బు తీసుకుని బంగారం ఇవ్వడం మానేసింది. అడిగిన వారికి రేపు, మాపు అంటూ తిప్పడం మొదలెట్టింది. దాంతో విసుగొచ్చిన ఓ వ్యక్తి ఆమెతో గొడవకు దిగాడు. ఆమెను బలవంతంగా లాక్కొళ్లి ఓ దగ్గర బంధించి కొట్టారు. మహిళకు డబ్బివ్వాల్సిన మరో వ్యక్తి ఫోన్ చేసి ఓ ప్రదేశం చెప్పి రామన్నాడు. వేరే యువతితో కలిసి అక్కడకు వెళ్లిన ఆమెను ఎవరో అపహరించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం నిందితులను పట్టుకున్నారు. ఆమెపై మాత్రం ఎలాంటి ఫిర్యాదు లేదంట.
ఆమె బంగారం వ్యాపారం లావాదేవీలు దాదాపు 5 కోట్ల రూపాయలు ఉంటాయని టాక్. మరి అంత బంగారం తక్కువ ధరకు ఎలా ఇస్తోంది. ఆ బంగారం ఎలా వస్తోందన్నది ప్రశ్నగానే మిగిలిపోయింది. నిజంగా అలాంటి మోసం జరిగుంటే బాధితులు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.