హైదరాబాద్ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ చోరీ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూ.22 లక్షల తీసుకుని పరారయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్ ప్రవీణ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశాడు. గత కొన్ని రోజులుగా ప్రవీణ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రవీణ్ కోర్టులో లోంగిపోతూ ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.
ఇందులో ప్రవీణ్ బ్యాంక్ సిబ్బందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ బ్యాంకు అధికారులు కుంభకోణాలకు పాల్పడుతున్నారని ఆరోపించాడు. త్వరలో సాక్షాధారాలతో సహా అందరి బాగోతాలు బయటపెడతానని క్యాషియర్ ప్రవీణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, చేయని తప్పుని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తూ నన్ను దోషిగా చిత్రీకరిస్తున్నారని ప్రవీణ్ అన్నాడు.
ఇది కూడా చదవండి: Vanasthalipuram: బ్యాంకులోని రూ.22 లక్షల నగదుతో క్యాషియర్ పరార్! కేసులో ఊహించని ట్విస్ట్!ఇక బ్యాంకు అధికారులు చేసే కుంభకోణాలు ఒక వనస్థలిపురంలోనే కాదని, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నాయని ప్రవీణ్ ఆరోపించాడు. అసలేం ఈ కేసులో ఏం జరిగిందంటే? వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ లో ప్రవీణ్ అనే వ్యక్తి క్యాషియర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కాగా గత వారం కిందట ప్రవీణ్ జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ కు అలవాటు పడ్డాడని, ఇక బెట్టింగ్ లో పడి ప్రవీణ్ పూర్తిగా నష్టపోవడంతో పని చేస్తున్న బ్యాంక్ కే కన్నం వేయాలనుకున్నాడనే వార్తలు వినిపించాయి.
ఇక ఇందులో భాగంగానే ప్రవీణ్ బ్యాంకులో రూ. 22 లక్షల 53వేలు తీసుకుని కనిపించకుండా పరారయ్యాడంటూ బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రవీణ్ ను పట్టుకునేందుకు పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా క్యాషియర్ ప్రవీణ్ విడుదల చేసిన ఈ సెల్ఫీ వీడియో సంచలనంగా మారుతోంది. ఇక రానున్న రోజులో ఈ కేసు ఎక్కడికి మలుపు తిరుగుతుందో చూడాలి మరి. తాజాగా ప్రవీణ్ విడుదల చేసిన ఈ సెల్ఫీ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.