నేటి కాలంలో కొందరు ఉపాధ్యాయులు పవిత్రమైన వృత్తికి మచ్చతెస్తున్నారు. చదువు చెప్పాల్సిన గురువులే విద్యార్థులపై లైంగిక దాడులకు పాల్పడుతూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకొకటి పుట్టుకొస్తునే ఉన్నాయి. తాజాగా అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రిన్సిపల్ స్టూడెంట్ ని నమ్మించి సినిమాకు తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడు. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అసలేం జరిగిందంటే? హయత్ నగర్ లోని సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్, కరెస్పాండెంట్ గా పని చేస్తున్నాడు. ఉపాథ్యాయ వృత్తిలో ఉన్న సత్యనారాయణ పిల్లలకు పాఠాలు చెప్పాల్సింది పోయి లైంగికంగా వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఇంటర్ చదువుతున్న ఓ బాలికపై కన్నేశాడీ కంత్రి ప్రిన్సిపల్. ఇటీవల ఆ బాలికకు మాయమాటలు చెప్పి సినిమాకు తీసుకెళ్లాడు. ఇది నమ్మిన ఆ బాలిక మాస్టారుతో పాటు సినిమాకు వెళ్లింది.
థియేటర్ లో సినిమా చూసే క్రమంలో ఈ మాస్టారు విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తాకరాని చోట చేతులు వేస్తూ పాడు పనులు చేశాడు. దీంతో భయపడ్డ ఆ విద్యార్థి ఇదే విషయాన్ని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు పూసగుచ్చినట్లు వివరించింది. దీంతో ఒంటికాలుపై లేచిన ఆ విద్యార్థి తల్లిదండ్రులు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ కంత్రీ ప్రిన్సిపల్ కీచక లెక్కలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: డాక్టర్స్ దారుణం! పసిబిడ్డ తల్లికి కడుపులో కాటన్ పెట్టి.. కుట్లు వేసేశారు!