ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ నవ వధువు పెళ్లైన నెల రోజులకు ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. క్రిష్ణా జిల్లా మొవ్వ మండలం కోసూరు గ్రామం. తెలసి జ్యోత్స్న పెళ్లై ఇద్దరు కూతురులు ఉన్నారు. అయితే భర్త గతంలోనే మరణించడంతో దీంతో కుట్టుమిషన్ ను నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తోంది. కాగా పెద్ద కూతురు జిత్రేంద్రిత సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. కానీ ఆమెకు పెళ్లంటే మొదటి నుంచే ఇష్టం లేదు. దీంతో చిన్న కుమార్తె పెళ్లై గతంలో జరిపించారు.
అయితే ఎట్టకేలకు పెద్ద కుమర్తె జితేంద్రితకు మార్చి 27న వరంగల్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగితో కుటింబీకులు వివాహం జరిపించారు. అయితే హైదరాబాద్ లోని కేపీహెచ్ బీ కాలనీలో ఈ నూతన దంపతులు నివాసం ఉంటున్నారు. భర్త ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లడంతో జితేంద్రిత ఇంట్లో ఉండేది. అయితే సోమవారం రాత్రి 10 గంటల సమయం. భర్త వచ్చి తలుపులు కొట్టాడు. భార్య జితేంద్రిత ఎంతకు తలుపులు తీయట్లేదు. ఏం జరిగిందనే కంగారులో భర్త తలుపులు బద్దలు కొట్టి చూసే సరికి జితేంద్రిత ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇది కూడా చదవండి: మోయలేని భారం.. చివరికి ఈ కుటుంబం చేసిన పని ఎవరూ ఊహించరు!ఈ విషయం తెలుసుకున్న తల్లి జ్యోత్స్న కన్నీరు మున్నీరుగా విలపించింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటింబీకులను విచారించగా ఇష్టం లేని పెళ్లి కారణంగానే జితేంద్రిత ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.