ఆంజనేయ స్వామి పిలిచాడు..అందుకే ఈ లోకాన్ని విడిచెలుతున్నా

ఈ పోటీ ప్రపంచంలో ఎంతో మంది యువతి, యువకులు అనుకున్నది సాధించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రియురాలు మోసం చేసిందని, ప్రియుడు మోసం చేశాడని, ఉద్యోగం రాలేదని, అమ్మ నాన్న మందలించారని ఇలా ఎనో రకాలైన కారణాలతో నిండు జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. కానీ హైదరాబాద్ కవాడిగూడలోలో మాత్రం ఓ యువకుడు ఏకంగా దేవుడు పిలిచాడని, అందుకే మరణిస్తున్నానంటూ ఆత్మహత్య చేసుకున్నాడు.

Boys Sucide minఇక వివరాల్లోకి వెళితే సిద్ధిపేట-తాళ్ల బస్తికి చెందిన గోపాల్ అనే యువకుడు కొన్నాళ్లుగా కవాడిగూడలో నివాసం ఉంటున్నాడు. ఎన్నో రోజులుగా పెళ్లి చేసుకుకోవాలి అనుకున్నా, పరిస్థితులు అనుకూలించక గోపాల్ పెళ్లి చేసుకుకోలేదట. ఈ క్రమంలోనే తన తమ్ముడు వివాహం చేసుకున్నాడు. ఇక తమ్ముడు కూడా పెళ్లి చేసుకోవడంతో గోపాల్ లోలోపల కుమిలిపోయాడు. ఇక ఈ జీవితం వద్దనుకుని ఆత్మహత్య చేసుకొవాలనుకున్నాడు. అదే పనిగా ఆంజనేయ స్వామి రమ్మన్నాడు అందుకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నానని సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు గోపాల్. తమ్ముడుకి పెళ్లి అయిందని ఎప్పుడు మనస్తాపంతో కుమిలిపోయేవాడని గోపాల్ బంధువులు ఆరోపిస్తున్నారు. ఇక స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులకు.