బెడ్ రూంలో సీక్రెట్ గా సీసీ కెమెరా.. రికార్డైన దృశ్యాలను చూసి బిత్తరపోయిన భర్త..!

CCTV

భార్యపై అనుమనంతో ఓ భర్త ఏకంగా బెడ్ రూంలోనే సీసీ కెమెరాను అమర్చిన ఘటన గుజరాత్ లో చోటు చేసుకుంది. కానీ ఆ ప్రయత్నం బెడిసికొట్టడంతో చివరికి భర్తే కటకటాలపాలయ్యాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గాంధీనగర్ ప్రాంతానికి చెందిన భరత్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో 2011లో వివాహం జరిగింది. అయితే కొంత కాలం వీరి వైవాహిక జీవితం బాగానే సాగింది. కొన్ని రోజుల తర్వాత వీరికి ఓ కుమార్తె జన్మిచింది.

ఇక 2014లో భరత్ ఉద్యోగం నిమిత్తం అమెరికాకు వెళ్లి కొన్నేళ్లకు మళ్లీ ఇండియాకు తిరిగొచ్చాడు. కానీ ఈ మధ్యకాలం నుంచి భార్యను అత్తమామలతో పాటు భర్త కూడా వేధించటం మొదలు పెట్టారు. గతంలో అదనపు వరకట్నం కింద అనేక సార్లు భర్త భార్యతో గొడవకు దిగేవాడు. అలా ఇంట్లోని అందరూ ఆ వివాహితపై దాడికి దిగేవారు. అయితే ఇటీవల కాలంలో భార్యపై అనుమానమొచ్చిన భర్త బెడ్ రూంలో సీక్రెట్ గా సీసీ కెమెరాలు అమార్చాడు. ఇక ప్రతీ రోజు భర్త భార్యను వేధిస్తూ కొట్టడం మొదలు పెట్టాడు. దీంతో ఆ దృశ్యాలు అందులో రికార్డ్ అయ్యాయి.

CCTVఇక అనుమానమొచ్చిన భార్య సీసీ కెమెరాల విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వెంటనే స్పందించిన ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా రికార్డ్ దృశ్యాలను పరిశీలించారు. ఇందులో భార్యపై భర్తతో పాటు అత్తమామలు దాడి చేస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. ఈ విషయం తెలుసుకున్న భర్త ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. తను అనుకున్న ప్రయత్నం బెడిసి కొట్టిందని భావించేలోపు పోలీసులు భర్త, అత్తమామపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.