పోలీస్.. ఎక్కడైనా సమాజం ప్రశాంతంగా ఉంది అంటే దానికి కారణం పోలీసు అన్నలే. సంవత్సరం అంతా అలసట అన్నది లేకుండా వారు లా అండ్ ఆర్డర్ కాపాడుతున్నారు కాబట్టే మన జీవితాలు హాయిగా వెళ్లిపోతున్నాయి. ఇలా ప్రజల కోసం పని చేసే పోలీసుల మధ్యనే.., ప్రజలను దోచుకోవాలని చూసే కొంత మంది బ్యాడ్ పోలీసులు ఉండటం కాస్త విచారించతగ్గ విషయం. ఇక అచ్చం ఇలాగే దొంగతనం చేసి సీసీ కెమెరాకు దొరికాడో దొంగ పోలీసు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వరగంగల్ జిల్లాలోని నర్సంపేట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్నాడు రవిందర్ అనే కానిస్టేబుల్. అయితే గత నెల కిందట దొంగతనం కేసులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి అతని బైక్ ను సీజ్ చేశారు పోలీసులు. కాగా గత కొన్ని రోజుల నుంచి ఆ బైక్ కనిపించకపోవటంతో స్టేషన్ పోలీసులు కాస్త షాక్ కు గురయ్యారు. ఇది ఎవరి పని అయ్యి ఉంటుందని అనుమానితుల్నీ విచారించారు. ఎంతకు కూడా బైక్ ను ఎత్తికెళ్లింది ఎవరో తేలకపోవటంతో పోలీసులు స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ని పరిశిలించారు. ఇక ఈ ఫుటేజ్ లో మాత్రం నమ్మలేని దృశ్యాలు బయటపడటంతో పోలీసులు ఖంగుతిన్నారు.
ఇంతకి ఆ బైక్ దొంగలించింది ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు ఆ స్టేషన్ లో పని చేసే హెడ్ కానిస్టేబుల్ రవిందర్. ఈ విషయం తెలుసుకున్న స్టేషన్ సీఐ, ఎస్సై కానిస్టేబుల్ రవిందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా వరంగల్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఒక బాధ్యత గల ఉద్యోగంలో ఉన్న ఈ కానిస్టేబుల్ ఇలాంటి పాడు పనులు చేస్తూ పవిత్రమైన పోలీసు వ్యవస్థను అపవిత్ర పాలు చేస్తున్నాడు. ఇక దొంగతనానికి పాల్పడ్డ కానిస్టేబుల్ రవిందర్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.