జీజీహెచ్ ఈసీజీ విభాగంలో దారుణం!

Ggh Ec Scan Huntur Ap

ఈసీజీ స్కాన్ తీస్తూ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చోటుచేసుకుంది. పాతగుంటూరుకు చెందిన 19 ఏళ్ల యువతి ఛాతి నొప్పి కారణంగా ఆమె తల్లిదండ్రులతో కలసి ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షించిన డాక్టర్లు ఈసీజీ స్కానింగ్ చేయించుకొని రావాలని సూచించారు. తల్లిదండ్రులతో కలిసి యువతి అదే ఆసుపత్రిలోని ఈసీజీ విభాగానికి వెళ్లింది. స్కానింగ్‌ సెంటర్‌లోకి తల్లిదండ్రులను అనుమతించలేదు ల్యాబ్‌టెక్నీషియన్‌ హరీశ్‌. స్కాన్ కోసం బట్టల తీసేయాలని టెక్నీషియన్‌ యువతికి సూచించాడు. దీనికి ఆమె అభ్యంతరం తెలిపింది.

బట్టలు ఉంటే స్కానింగ్‌ రాదని.. మీ తరువాత చాలా మంది స్కానింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్నారంటూ ఆమెను ఒత్తిడి చేశాడు. ఆమెను బలవంతగా వివస్త్రను చేయించి.. ఓ వైపు ఈసీజీ స్కానింగ్‌ తీస్తూనే.. ఫోన్‌లో వీడియో రికార్డు చేస్తుండగా.. గమనించిన యువతి కంగుతి వెంటనే తెరుకోని అతనిపై ప్రతిఘటించింది. విషయం అంతా తల్లిదండ్రులకు వివరించింది. ఆవేశంతో అమ్మాయి తండ్రి అతడిని నిలదీయగా అలాంటిదేమి చేయలేదంటూ బుకాయించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూశాయి. ఈసీజీ విభాగంలో పనిచేసే శంకర్ అనే ఉద్యోగి అనారోగ్యం కారణంగా గత కొంతకాలంగా సెలవుల్లో ఉన్నాడు.

పోలీసులు శంకర్ ను విచారించగా నాకు సహాయకుడిగా ఓ విద్యార్థి మాత్రమే ఉండే వాడని ఆ విషయం ఆసుపత్రిలోని ఉన్నతాధికారులకు తెలుసని అన్నాడు. అయితే ఈ హరీష్ ఎవరో తనకు తెలియదని తెలిపాడు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి స్కానింగ్‌ సెంటర్‌లో పనిచేస్తుంటే ఆసుపత్రిలోని ఉన్నతాధికారులకు తెలియాకపోవడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య ప్రభావతి మాట్లాడుతూ… యువతి ఫొటోలు తీసిన హరీష్ అనే వ్యక్తి ఆసుపత్రి ఉద్యోగి కాదని, విధుల్లో ఉండాల్సిన శంకర్ లేడన్నారు. కనీస సమాచరం లేకుండా విధులకు రాని శంకర్ ను తొలగిస్తున్నట్లు ఆమె తెలిపారు.