సైదాబాద్‌లో బాలిక కుటుంబాన్ని పరామర్శించి కన్నీరు పెట్టుకున్న సీతక్క!..

Sitakka in tears after visiting the girl family in Saibarabad - Suman TV

సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై, హత్యకు గురైన‌ ఆరేళ్ళ చిన్నారి కుటుంబసభ్యులను ఈ రోజు ఉదయం ములుగు శాసనసభ్యురాలు సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో మందు, గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయని అని అన్నారు.  హైద‌రాబాద్‌లోని  సైదాబాద్‌లో ఇటీవ‌ల ఆరేళ్ల‌ బాలిక తమ ప‌క్కింట్లో విగ‌త‌జీవిగా క‌న‌ప‌డిన విష‌యం క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబాన్ని ఈ రోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే  సీత‌క్క ప‌రామ‌ర్శించారు. వినాయ‌క చ‌వితి రోజున న‌గ‌ర న‌డిబొడ్డున ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగిందని, ఈ ఘ‌ట‌నపై ఇప్ప‌టికీ ప్ర‌భుత్వం స్పందించ‌లేదని ఆమె విమ‌ర్శించారు.  సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇప్ప‌టికీ స్పందించ‌క‌పోవ‌డం ఏంటని సీత‌క్క నిల‌దీశారు.

Man Has Raped six-year-old girl in Khammam district - Suman TVనిందితుడిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతో అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని, నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్న‌ట్లు తెలుస్తోందని ఆమె చెప్పారు. వాటివల్లనే ఇలాంటి అఘాయిత్యాలు పెరుగుతున్నాయని  సీరియ‌స్ అయ్యారు అభం శుభం తెలియని చిన్నారి నరరూప రాక్షసుడి చేతిలో బలికావడం బాధను కలిగిస్తుందని   వ్యాఖ్యానించారు. నిందితుడి కి వెంటనే కఠిన శిక్ష ను విధించాలని సీత‌క్క డిమాండ్ చేశారు. చిన్నారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని సీత‌క్క అన్నారు. ఆ దుర్మార్గుడిని బ‌హిరంగంగా ఉరితాయాలంటూ సీతక్క వ్యాఖ్యానించారు. వాడిని బ‌య‌ట‌కు తీసుకురావాల‌ని రాళ్ల‌తో కొట్టాలో ఉరితీయాలో నిర్ణ‌యం తీసుకోవాని అన్నారు  వెంట‌నే నింధితుడికి క‌ఠినంగా శిక్ష వేయాల‌ని  అన్నారు.

పోలీసులు బాధిత కుటుంబం పైనే మ‌ళ్లీ దాడి చేశార‌ని సీత‌క్క ఆరోపించారు. గిరిజ‌న బిడ్డ‌కు జ‌రిగిన అన్యాయంపై ప్ర‌భుత్వం స్పందించ‌డం లేదని మండిప‌డ్డారు. ఎమ్మెల్యేలు కూడా మాట్లాడ‌క‌పోవ‌డం ప్ర‌భుత్వ తీరుకు నిద‌ర్శ‌నమ‌ని, ఘ‌ట‌నాస్థ‌లికి అధికారుల‌ను పంపి చేతులు దులుపుకుంటున్నారని ఆమె విమ‌ర్శించారు.