కమెడియన్ సంతానం ఇంట్లో విషాదం!

santhanam sister

కరోనా ఒకవైపు మానవాళి నాశనాన్ని కోరుతూ విజృంభిస్తోంది. మరోవైపు మనిషి అత్యాశ సాటి మనుషులను కబళిస్తోంది. ఇలాంటి అత్యాశ, కోపం కారణంగా స్టార్ కమెడియన్ సంతానం ఇంట్లో ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నాయి. సంతానంకి వరుసకు చెల్లులు అయ్యే జయభారతి హత్యకి గురి కావడం ఇప్పుడు అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఇక్కడ ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ హత్యకి సూత్రధారి ఆమె భర్త విష్ణు ప్రకాష్ కావడం. ఆ వివరాల్లోకి వెళ్తే.. సంతానం చెల్లి జయభారతి అమెరికాలో సెటిల్ అయిన విష్ణు ప్రకాష్ కొన్నాళ్ల క్రితం ప్రేమించుకున్నారు. ఆ తరువాత పెదాలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ.., పెళ్లి అయిన కొద్ది రోజులకే వీరి మధ్య స్పర్ధలు వచ్చాయి. దీంతో.., భారతి ఇండియాకి వచ్చేయగా, భర్త ప్రకాష్ మాత్రం అమెరికాలోనే ఉండిపోయాడు.

santhanam’s relative Jayabharathi brutal murder caseఇండియాకి వచ్చేసినా భారతికి మాత్రం భర్త నుండి వేధింపులు తప్పలేదు. ఇక జయభారతి తన భర్త వేధింపులకు పాల్పడుతున్నాడని కోర్టుని ఆశ్రయించింది. ఈ మొత్తం ప్రభావం విష్ణు ప్రకాష్ ఉద్యోగంపై పడింది. కనీసం అప్పటికీ అతను తన పద్దతిని మార్చుకోకపొగా భార్య అడ్డుని పూర్తిగా తొలగించేసుకోవాలి అనుకున్నాడు. అతని ప్లాన్ ప్రకారం జయభారతి ప్రైవేట్ కంపెనీలో జాబ్ పూర్తి చేసుకుని వస్తున్న సందర్భంలో భారతిని బ్యాంక్ కి క్యాష్ తీసుకెళ్లే వాహనంతో గుద్దించారు. కానీ.., ఒక్కసారికే ఆమె చనిపోకపోవడంతో ఆమె పై చాలాసార్లు వాహనాన్ని పోనిచ్చారు. దీంతో.., పోలీసులు ఈ వ్యవహారాన్నీ మరో కోణంలో విచారించగా ఇది ప్రీ ప్లాన్డ్ పక్కా మర్డర్ అని తేలింది. భర్త విష్ణు ప్రకాష్ చెప్పడం వల్లే తాము ఆమెను చంపినట్లుగా నింధితులు పోలీసుల విచారణలో నిజాన్ని ఒప్పుకున్నారు. దీంతో విష్ణు ప్రకాష్ పై కేసు బుక్ చేసి , ఇండియాకి రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఇక చెల్లిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న సంతానం తమిళ సినీ ఇండస్ట్రీ నుండి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుండటం విశేషం.