ఈ రోజుల్లో కొంతమంది యువత ప్రతీ చిన్ని విషయాలకే క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రేమ విఫలమైందని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఏపీలోని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని అక్కూర్తి. ఇదే గ్రామానికి చెందిన రాహుల్ (20) నివాసం ఉంటున్నాడు. అయితే రాహుల్ తిరుపతిలోని ఓ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. కాగా ఇటీవల ప్రకటించిన బీటెక్ పరీక్ష ఫలితాల్లో రాహుల్ ఫెయిల్ అయ్యడు. ఫెయిల్ అయ్యాడని అందరూ అతడిని చిన్న చూపు చూశారు. దీంతో రాహుల్ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఏం చేయాలో తెలియక ఇంట్లో ఉన్న పరుగుల మందు తాగాడు.
వెంటనే గుర్తించిన ఆ యువకుడి కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాహుల్ మరణించాడు. రాహుల్ మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాహుల్ ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్యకు పాల్పడ్డ రాహుల్ నిర్ణయం సమంజసమేనా? ఇలాంటి చిన్న చిన్న వాటికే బలవన్మరణానికి పాల్పడుతున్న వారికి మీరు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.