తమిళనాడులో దారుణం.. ప్రియురాలి గొంతులో కత్తితో పొడిచి.. ఆపై..!

crime

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమికుల మధ్య వివాదం తారా స్థాయికి చేరటంతో ప్రియుడు ప్రియురాలిపై కత్తితో దారుణానికి తెగబడ్డారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని క్రోమ్‌పేట్‌లో నివాసం ఉంటున్న శ్వేత అనే యువతికి, నాగపట్టణం జిల్లా తిరుక్కువలైకు చెందిన రామచంద్రన్ అనే యువకుడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా రోజులు గడుస్తూ వీరి ప్రేమకు మూడేళ్లు నిండాయి.

అప్పటి వరకూ బాగానే ఉన్నా వీరు గతకొంత కాలం నుంచి గొడవలు పడుతూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల చెన్నైలోని తాంబరం రైల్వే స్టేషన్ ప్రాంతంలో వీరిద్దరూ కలిసి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఆ వివాదం పెద్దదైంది. ఇక కోపంతో రగిలిపోయిన రామచంద్రన్ వెంట తెచ్చుకున్న కత్తితో శ్వేత గొంతులో పోడిచి దారుణానికి తెగబడ్డాడు.

ఇక అనంతరం తాను ఆత్మహత్య చేసుకోబుతుంటే స్థానికులు గమనించి ఆ యువకుడి వద్ద ఉన్న కత్తిని లాగేసుకున్నారు. శ్వేత మాత్రం రక్తపు మడుగులో పడి ప్రాణాలు విడిచింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇక నిందిుతుడిని వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించి రామచంద్రన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.