9 ఏళ్లుగా ప్రియుడితో వివాహిత డేటింగ్.. భర్త మరో కుంపటితో ఎదురైన కొత్త ట్విస్ట్..!

dating

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం గంగాధరపేట గ్రామానికి చెందిన వివాహిత కొప్పల కమల. ఈమెకు 2005లో అదే గ్రామానికి చెందిన సింగుమహాంతి భుజంగరావు అనే వ్యక్తితో తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. పిల్లలతో హాయిగా గడపాల్సిన జీవితాన్ని కమల వివాహిత సంబంధాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. ఇక కమలకు పెళ్లి కంటే ముందే దేవరాజు అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఇక కొన్నాళ్లు భర్తతో సంసారం చేసిన కమల ప్రియుడిపై మోజుతో పెళ్లైన దేవరాజుతో కలిసి ఉండాలనుకుంది.

ఇక దేవరాజుకు కూడా పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. ఇక కమలకు ఏం చేయాలో తెలియక భర్తను పిల్లలను కాదని ప్రియుడు దేవరాజుతో 2012లో వెళ్లిపోయి అతడితో పాటే ఉంటుంది. ఇక ఇద్దరు కలిసి ఓ రూమ్ లో సంసారాన్ని పెట్టినా దేవరాజు కమలను పెళ్లి మాత్రం చేసుకోలేదు. దీంతో ఇదే విషయమై తరుచు ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగేవి. ఇక కమల పెళ్లి చేసుకోవాల్సిందే అంటూ కమల దేవరాజును ప్రతీ రోజు వేధిస్తూ ఉండేది. ఇక ఏం చేయాలో తెలియక దేవరాజు కమలను అంతమొందించేందుకు ప్లాన్ వేశాడు.

గత శుక్రవారం అర్థరాత్రి కమలను నమ్మించి బయటకు తీసుకెళ్లాడు. ఇక తాను తెచ్చకున్న కత్తితో కమలపై పలుమార్లు దాడికి దిగాడు. దీంతో రక్తపు మడుగులో పడి ఉన్న కమలను చూసిన దేవరాజు చనిపోయిందని భావించి అక్కడి నుంచి జారుకున్నాడు. కానీ కమల ఇంకా అప్పటికీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతు ఉంది. గమనించిన స్థానికులు వెంటనే కమలను ఆస్పత్రిలో చేర్పించారు. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు దేవరాజుతో పాటు మారో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భర్తను, పిల్లలను కాదని ప్రియుడి మోజులో పడి జీవితాన్ని ఎటు కాకుండా చేసుకున్న కమల తీరుపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.