నాలుగు రోజుల క్రితం ఓ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆరేళ్ల విద్యార్థిని ట్యూషన్ టీచర్ ఏమాత్రం జాలి, దయ లేకుండా విచక్షణారహితంగా చావబాదాడు. దెబ్బలకు తాళలేక సదరు విద్యార్థి స్పృహ తప్పి పడిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. ట్యూషన్ టీచర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అతడిని అరెస్ట్ చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బిహార్ పోలీసులు సదరు ట్యూషన్ టీచర్‌ని అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది.. ఎందుకు ఆ టీచర్ అంతలా రెచ్చిపోయాడు వంటి వివరాలును వెల్లడించారు.
ఈ దారుణ సంఘటన బిహార్, పట్నా పరిధిలోని వీర్ ఒరియాలో చోటు చేసుకుంది. ఇదే ప్రాంతంలో జయ అనే కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లో ఛోటు అనే యువకుడు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈ మాస్టారు ఓ ఐదేళ్ల బాలుడు సరిగ్గా చదవడం లేదని అతనిపై కర్కశంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి కర్రతో దాడి చేస్తూ, కాళ్లతో తన్నాడు. బాలుడు కొట్టొద్దని కాళ్లాయేళ్ల పడ్డా అస్సలు కనికరించకుండా ఆ దుర్మార్గుడు దారుణంగా దాడికి దిగాడు.ఆ దెబ్బలకు తాళలేక విద్యార్థి స్పృహ తప్పాడు. దాంతో వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ తతంగాన్ని కొందరు విద్యార్థులు చాటుగా వీడియో తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది విపరీతంగా వైరల్ అవ్వడమే కాక.. ట్యూషన్ టీచర్‌ను అరెస్ట్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఇది కూడా చదవండి: Bihar: 5 ఏళ్ల బాలుడిపై దారుణంగా ప్రవర్తించిన టీచర్ .. వీడియో వైరల్!
ఈ క్రమంలో బిహార్ పోలీసులు సదరు టీచర్ ఛోటును అరెస్ట్ చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 342, 322, 307, 506 లతో పాటు జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 75 (పిల్లలపై దాడి చేయడం, విడిచిపెట్టడం, దుర్వినియోగం చేయడం, బహిర్గతం చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం లేదా పిల్లలపై దాడి చేయడం, విడిచిపెట్టడం, దుర్వినియోగం చేయడం, వదిలేయడం, నిర్లక్ష్యం చేయడం.. మానసిక, శారీరక బాధలకు గురిచేయడం చేస్తే.. నిందితులకు మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా లేదా రెండూ విధించబడతాయి)ల కింద కేసు నమోదు చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
कोचिंग में बच्चे की डंडों से पिटाई करने वाले इस हैवान को पुलिस ने गिरफ़्तार कर लिया है. पिटाई की वजह हैरान करने वाली है.
दरअसल कथित शिक्षक एक छात्रा के साथ गंदी बातें कर रहा था जिसे इस छात्र ने देख लिया था. इसी बात से नाराज़ होकर इसने मासूम की बेरहमी से पिटाई की. pic.twitter.com/M4TnyeTbl4
— Utkarsh Singh (@UtkarshSingh_) July 7, 2022
ఇది కూడా చదవండి: ఒంటి కాలిపై పాఠశాలకు! బాలిక కష్టం చూసి చలించిపోయిన మంత్రి KTR!