ఆర్యన్ ఖాన్ తో డ్రగ్స్ కోసం అనన్య పాండే చాటింగ్! చాట్ లీక్!

ananya pandey drugs case

డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆర్యన్‌ ఖాన్‌తో బాలీవుడ్ హీరోయిన్‌ అనన్య పాండే డ్రగ్స్‌ విషయమైన చాటింగ్‌ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఎన్సీబీ అధికారులు అనన్య పాండే ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. షారుఖ్‌ ఖాన్‌, అనన్య పాండే నివాసల్లో కూడా ఎన్సీబీ పోలీసులు సోదాలు నిర్వహించారు. విచారణకు హాజరు కావాల్సిందిగా అనన్య పాండేను ఎన్సీబీ పోలీసులు ఆదేశించారు. కాగా క్రూయిజ్‌ షిప్‌లో జరగుతున్న పార్టీలో డ్రగ్స్‌ వినియోగంపై ఆర్యన్‌ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

పలు సార్లు ఆర్యన్‌ ఖాన్‌ బెయిల్‌ కోరగా కోర్టు నిరాకరించింది. జ్యూడీషియల్‌ కస్టడీలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ ఫోన్‌ను పరిశీలించిన ఎన్సీబీ అధికారులు హీరోయిన్‌ అనన్య పాండేతో డ్రగ్స్‌ విషయమైన చాటింగ్‌ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ కేసుతో మరింతమంది బాలీవుడ్‌ ప్రముఖులకు సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ డ్రగ్స్‌ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న ఎన్సీబీ విచారణలో దూకుడు పెంచింది. కాగా షారుఖ్‌ ఖాన్‌ గురువారం జైలుకు వెళ్లి కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ను కలిశారు. ఆర్యన్‌ ఆరోగ్యంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.